CM KCR New Schemes: తెలంగాణ ప్రజలపై డబ్బులు.. కెసిఆర్ పెద్ద స్కెచ్!
గతంలో డబుల్ బెడ్ రూంఇళ్లను ప్రారంభించినప్పుడు ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోలేని వారికి డబ్బులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ పెట్టింది. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు.

CM KCR New Schemes: సంక్షేమ పథకాలతో ఓట్లు కొల్లగొడుతున్న కేసీఆర్.. ఆ పథకాలతోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. మరో ఆరు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోమారు కొత్త స్కీలం ప్రకటనకు సిద్ధమవుతన్నారు. కేసీఆర్ పథకాలు హెవీగా ఉంటాయి. ఎంత అంటే.. లబ్ధిదారులకు.. వందల్లో.. వేలల్లో కాదు ఏకంగా లక్షల్లోనే నగదు బదిలీ జరిగిపోతుంది. దళితబంధు ద్వారా పది లక్షలు ఇస్తున్నారు. బీసీ పథకం ద్వారా రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఇళ్ల నిర్మాణం కోసం రూ. మూడు లక్షలు ఇవ్వాలని డిసైడయ్యారు. కొత్తగా ఇళ్ల పథకానికి ఈ ఏడాది రూ.18 వేల కోట్లను ఖర్చు చేస్తామని చెబుతోంది. దళిత బంధు పథకానికి, బీసీ బంధు పథకానికి కూడా వేల కోట్లు కావాలి. ఇప్పుడు ఇళ్ల నిర్మాణ పథకానికీ అంత కంటే ఎక్కువ ఖర్చు చేస్తామని చెబుతోంది. నిజంగా ఇస్తారా లేదా అన్న సంగతి తర్వాత. కానీ మంజూరు పత్రాలు మాత్రం విస్తృతంగా పంపిణీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
సొంత జాగా ఉన్నవారికి..
గతంలో డబుల్ బెడ్ రూంఇళ్లను ప్రారంభించినప్పుడు ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోలేని వారికి డబ్బులిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ పెట్టింది. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఎన్నికలు రాబోతున్న సమయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తు తీసుకుంటారన్నమాట. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు వచ్చేస్తాయి.
ఎన్నికల కోడ్ సాకుచూపి..
కొంతమంది ఖాతాల్లో నగదు జమచేసి.. మిగతావారికి ఎన్నికల కోడ్ సాకుగా చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మళ్లీ గెలిపిస్తే.. ఎన్నికలు ముగియగానే మిగతా వారి ఖాతాల్లో డబ్బులు వేస్తామని నమ్మించే వ్యూహంలో గులాబీ బాస్ ఉన్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ వరద బాధితులకు ఇలాగే ప్రకటించారు. ఇటీవల అకాల వర్షాల బాధితులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించారు. కానీ తర్వాత వాటి ఊసే లేదు. ఇప్పుడు కూడా గృహలక్ష్మి ద్వారా ఓటర్లకు గాలం వేయాలని, ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారు. దీంతో ఓట్ల పంట పండుతుందని బీఆర్‌ఎస్ పెద్దలు ఆశిస్తున్నారు.
ఆర్థిక సమస్యల్లో రాష్ట్రం..
వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం అని చెబుతున్నా.. పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. భూముల విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే పనిలో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ సంక్షేమానికి భారీగా నిధులు ఖర్చు చేయాలని భావిస్తోంది.