రైతు కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలు ఏర్పాటు చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. శనివారం రైతు వేదికల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని, తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రాలు అందించాలనుకున్నా కేంద్రం ఆంక్షలు పెడుతుందన్నారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామనుకుంటే ఎఫ్‌సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు.