వరద సాయంపై బురద రాజకీయం:కేటీఆర్‌

హైదరాబాద్‌లో ాళాలపై ఎన్నో అక్రమాలున్నాయని, అందువల్ల భారీ వర్షాలకు వరదలు సంభవించి కాలనీలు నీటిలో మునిగాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అత్యధిక వర్షపాతం నమోదైందని, మానవ తప్పిదాలతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం స్పందించి తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిందన్నారు. రూ. 10 వేల చొప్పున 4.30 లక్షల కుటుంబాలకు అందించామన్నారు. ఎలాంటి ఆపద […]

Written By: Suresh, Updated On : November 8, 2020 12:51 pm
Follow us on

హైదరాబాద్‌లో ాళాలపై ఎన్నో అక్రమాలున్నాయని, అందువల్ల భారీ వర్షాలకు వరదలు సంభవించి కాలనీలు నీటిలో మునిగాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అత్యధిక వర్షపాతం నమోదైందని, మానవ తప్పిదాలతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం స్పందించి తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిందన్నారు. రూ. 10 వేల చొప్పున 4.30 లక్షల కుటుంబాలకు అందించామన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అప్రమత్తతతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతుందని అన్నారు. వరద సాయంపై కాంగ్రెస్‌, బీజేపీ బురద రాజకీయం చేస్తుందన్నారు.