
కాంగ్రెస్‌లో వి. హనుమంతరావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్‌పై వీహెచ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీహెచ్‌పై పీసీసీ క్రమశిక్షణ కమిటీకి సతీష్‌మాదిగ, వేణుగోపాల్‌యాదవ్ ఫిర్యాదు చేశారు. ఠాగూర్, రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీహెచ్‌పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రమిచ్చారు. వీహెచ్ వ్యాఖ్యలపై ఠాగూర్ కూడా సీరియస్ అయ్యారు. రాష్ట్ర కార్యదర్శి బోస్‌రాజును మాణిక్యం ఠాగూర్ నివేదిక కోరారు. వీహెచ్ వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను బోస్‌రాజు.. ఠాగూర్‌కు పంపారు. ఠాగూర్ అమ్ముడుపోయాడంటూ వీహెచ్ వ్యాఖ్యలు చేశారు. వీహెచ్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.