Site icon OkTelugu

తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కేసులు కాస్త పెరిగాయి. వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 631 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,72,123 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,467గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,61,830 మంది కోలుకోగా ప్రస్తుతం 8,826యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 6,812 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version