Telangana BJP : కర్ణాటక, పశ్చిమ బెంగాల్ గుణపాఠాల్ని విస్మరిస్తున్న తెలంగాణ బీజేపీ

అయితే కేసీఆర్ కు సరితూగే నేతగా బండి సంజయ్ ను తెలంగాణ ప్రజలు చూడడం లేదు. బండి సంజయ్ ఇచ్చే హిందుత్వ తీవ్ర ప్రకటనలు ప్రజల్లో బీజేపీకి మైనస్ గా మారాయి.

  • Written By: Naresh
  • Published On:
Telangana BJP : కర్ణాటక, పశ్చిమ బెంగాల్ గుణపాఠాల్ని విస్మరిస్తున్న తెలంగాణ బీజేపీ

Telangana BJP : తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? అని అనిపిస్తోంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ గుణపాఠాలు నేర్చుకుంటుందా? అని అనుమానం వస్తోంది. ప్రజలు పార్లమెంట్ ఎన్నికలను, అసెంబ్లీ ఎన్నికలను వేరు వేరుగా చూస్తున్నారు. ఈ విషయం బీజేపీ నేతలకు తెలుసు.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అప్పుడే బీజేపీ గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆల్ మోస్ట్ అధికారంలోకి చేరువగా వచ్చి బీజేపీ చేజారిపోయింది. బెంగాళీ అస్తిత్వాన్ని బీజేపీ అక్కడ దెబ్బతీసింది. సెంటిమెంట్ ను రాజేసి మమత సీఎంగా ఎదిగారు. పార్లమెంట్ సమస్యలను తీసుకొచ్చి బెంగాల్ లో ప్రస్తావించారు. టీఎంసీని చీల్చి అందులోని నాయకులకు పెద్దపీట వేశారు. పాత బీజేపీ నేతలు షాక్ అయ్యారు. సరిగా పనిచేయలేదు. ఇదే అక్కడ ఓటమికి దారితీసింది. ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకొని చీకొట్టారు.

కర్ణాటకలోనూ ఇదే కథ.. ఈ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అవినీతి పెచ్చరిల్లింది. ఒకట ఆ వివాదాలను పరిష్కరించలేదు బీజేపీ పెద్దలు. కిందటి సారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని ముంబైలో పెట్టి దొంగతనంగా అధికారం సంపాదించారు. హిందుత్వ ఏజెండాను రెచ్చగొట్టగా దక్షిణాదిలో అది పనిచేయలేదు.

కర్ణాటకను ఆనుకొని ఉన్న తెలంగాణలో బీజేపీ బలపడలేకపోతోంది. తెలంగాణ సంస్థానంలో ఉన్న కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. లక్ష్మన్ ప్లేసులో బండి సంజయ్ బాగా పనిచేశారు. బీజేపీని బలోపేతం చేశారు. బండి సంజయ్ నిజాయితీపరుడు.. నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. అయితే కేసీఆర్ కు సరితూగే నేతగా బండి సంజయ్ ను తెలంగాణ ప్రజలు చూడడం లేదు. బండి సంజయ్ ఇచ్చే హిందుత్వ తీవ్ర ప్రకటనలు ప్రజల్లో బీజేపీకి మైనస్ గా మారాయి. ఇమ్మెచ్యూర్డ్ పర్సనాలిటీ కూడా చులకన చేస్తున్నాయి.

కర్ణాటక, పశ్చిమ బెంగాల్ గుణపాఠాల్ని విస్మరిస్తున్న తెలంగాణ బీజేపీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

సంబంధిత వార్తలు