TS SSC Results 2023: తెలంగాణ పదోతరగతి ఫలితాలు : 25 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే..!
పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నిర్మల్ జిల్లా 99 శాతం పాస్ పర్సంటేజ్‌తో మొదటి స్థానంలో గెలిచింది. అలాగే 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

TS SSC Results 2023: నెల క్రితం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రిజల్ట్స్ రానేవచ్చాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా పిల్లల రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. మే 9న ఇంటర్ ఫలితాలు విడుదల చేసి, మే 10న పది ఫలితాలు విడుదల చేశారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఉందో ఇప్పుడు చూద్దాం.
86.60 శాతం ఉత్తీర్ణత..
పదో తరగతి ఫలితాల్లో 86.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. నిర్మల్ జిల్లా 99 శాతం పాస్ పర్సంటేజ్‌తో మొదటి స్థానంలో గెలిచింది. అలాగే 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అయితే జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 26వ తేదీ నుంచి ఫీజ్ చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. రీకౌంటింగ్ కోసం ప్రతీ సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలని తెలిపారు.
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యల్పంగా 72.39శాతం ఉత్తీర్ణత సాధించారు. గురుకులాల విద్యార్థులు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.
25 పాఠశాలల్లో జీరో రిజల్ట్..
ఇక రాష్ట్రంలోని 25 పాఠశాలల జీరో రిజల్ట్ వచ్చాయని తెలిపారు. ఆయా పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలు రాసిన ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులు కూడా అయోమయం చెందవద్దని మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను మందలించొద్దని, వీలైతే ఎంకరేజ్ చేయాలని పేర్కొంటున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఓటమి నుంచి విజయం సాధిస్తారని సూచిస్తున్నారు.
