Tech Layoffs 2022: ఆశల స్వర్గం నరకం చూపిస్తోంది.. ఉపాధి కల్పిస్తుంది అనుకున్న దేశం ఇప్పుడు ఉన్నఫళంగా బయటకు గెంటేస్తోంది.
ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్… ఇలా ఏ కంపెనీ చూసుకున్నా లే_ ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులను ఉన్నఫళంగా తొలగించాయి. భవిష్యత్తులోనూ ఉద్వాసనలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామం మునుముందు ఎటు వెళ్తుందో ఏమో గాని.. ఉద్యోగాలు కోల్పోయిన వారు నరకం చూస్తున్నారు. దేశం కాని దేశంలో ఎలా బతకాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశం మొత్తం మీద అమెరికా అంటే ఒక ఆశల సౌధం అనే అభిప్రాయం ఉంది. అందుకే మన దేశం నుంచి ఏటా లక్షల మంది అమెరికా వెళ్తూ ఉంటారు. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉంది. కానీ ఆర్థిక మాంద్యం వంటి హెచ్చరికలతో ఇప్పుడు ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

Tech Layoffs 2022
గ్రీన్ కార్డుకు వెయిటింగ్
అమెరికాలో ఐటీ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు తమ ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగిస్తున్నాయి. ఇది హెచ్1- బీ వీసాదారులను కలవరపాటుకు గురిచేస్తున్నది. ఇటీవల ట్విట్టర్ ఏకంగా 3,500 మందికి పొగబెట్టింది. హెచ్1 బీ వీసా ల పై అమెరికా వెళ్లే వారిలో చేనేల తర్వాత భారతీయులే అత్యధికం. తాజా పరిస్థితులు వారి అవకాశాలనే ఎక్కువగా దెబ్బ తీస్తున్నాయి. ఒక కంపెనీ నుంచి తొలగించిన 60 రోజుల లోపే మరో కంపెనీ నుంచి ఆఫర్ పొందాలి. లేకుంటే పెట్టే బేడా సర్దుకోవాల్సిందే. అమెరికా ఏటా ఉద్యోగిత సంబంధిత హెచ్1 బీ గ్రీన్ కార్డులను భారతీయులకు 10,000 వరకు జారీ చేస్తుంది. మొత్తం కార్డుల్లో ఇది ఏడు శాతానికి సమానం. కానీ ఐదు లక్షల మందికి పైగా భారతీయుల దరఖాస్తులు ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం 2020లో దరఖాస్తు చేసిన వారికి 1995 ఏళ్ల వెయిటింగ్ నడుస్తోంది. ఇక చైనీయులకు 18 ఏళ్ల వెయిటింగ్ ఉంది. మిగతా దేశాలకు చెందిన హెచ్1బిసాదారుల దరఖాస్తులు ఏడాదిలోపే పరిశీలనకు వెళ్ళిపోతున్నాయి. ఇంజనీరింగ్, పీటర్ సైన్స్ చేసిన భారతీయులకు ఇప్పటికీ కూడా అమెరికానే స్వర్గధామం. గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా వారి నుంచే ఎక్కువ వస్తూ ఉంటాయి.

Tech Layoffs 2022
ఉద్యోగాలు ఊడిపోతున్నాయి
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 11 వేల మందిని బయటకు పంపింది.. వారిలో వెయ్యి మంది భారతీయులు ఉన్నారు. ఇక ఆ వెయ్యి మందిలో కూడా 400 మంది ఇండియాలో పని చేసేవారే. సీ గేట్ టెక్నాలజీ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 3,000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇక అమెజాన్ కూడా 10,000 మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వీరిలో అధికంగా భారతీయులే ఉన్నారు.. ట్విట్టర్ కూడా 3700 మందిని పక్కన పెట్టింది. టెస్లా కంపెనీ రాకకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెడుతుందన్న కోపం వల్ల ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. అయితే ఈ పరిణామాలు మొత్తం అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.. ముఖ్యంగా గ్రీన్ కార్డుకు వెయిటింగ్ పెంచుతున్నాయి. అప్పట్లో మహాకవి శ్రీశ్రీ “నువ్వు వెళ్లే రైలు.. కాలం లేటు అన్నట్టు” ఇప్పుడు అమెరికా గ్రీన్ కార్డు రెండు జీవిత కాలాల వెయిట్… ఇప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం తగ్గింది కాబట్టి మూడు జీవిత కాలాలు అనాలేమో.