IND vs AUS 1st Test Playing XI: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాగపూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాకు గాయాల బెడద అంటుకుంది. దీంతో కిలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కు సవాలుగా మారనుంది. బుమ్రా గాయాల నుంచి కోలుకోకపోగా శ్రేయస్ అయ్యర్ వెన్ను గాయం కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ కూడా జట్టుకు సేవలందించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా కంగారూలను ఏ మేరకు ఎదుర్కొంటుందోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

IND vs AUS 1st Test Playing XI
రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసే వారెవరు?
ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా ఎవరు వెళతారనేదానిపై స్పష్టత లేదు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపాలా? లేక శుభ్ మన్ గిల్ ను ఆడించాలా అనే దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. మంచి ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ తో ఓపెనింగ్ చేయిస్తే మంచి ఫలితాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం గిల్ కే మొగ్గు చూపుతున్నాడు. ఓపెనర్ గా గిల్ మాత్రమే నిలదొక్కుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అక్షర్ ను ఎందుకు పక్కన పెట్టారు
టీమిండియా జట్టు ఎంపికపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ వేదికగా జట్టు గురించి తన అభిప్రాయం వెలిబుచ్చాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో జట్టును ఎంపిక చేసిన అతతడు కుల్దీప్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్షర్ ను పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్ కు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నాడు. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో తెలియడం లేదు. అక్షర్ పటేల్ కూడా రాణిస్తుండగా అతడిని కాదని కుల్దీప్ ను ఎందుకు ప్రాధాన్యం ఇచ్చాడో తెలియదు.
కుల్దీప్ ప్రత్యేకత ఏంటి?
కుల్దీప్ యాదవ్ రిస్ట్ స్పిన్నర్ కావడంతో అతడిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపినట్లు జాఫర్ వివరించాడు. రోహిత్, రాహుల్ ఓపెనర్ల్లుగా ఉండగా మిడిలార్డర్ లో చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్ లు ఉన్నారు. వికెట్ కీపర్ గా తెలుగు వాడైన భరత్ ను తీసుకున్నాడు. ఆల్ రౌండర్లుగా జడేజా, అశ్విన్ లు, షమీ, సిరాజ్ లను పేసర్లుగా ఎంచుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ గురించి మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో టీమిండియా కంగారూలను ఎలా అడ్డుకుంటుందో వేచి చూడాల్సిందే.

IND vs AUS 1st Test Playing XI
జట్టు సభ్యులు వీరే..
వసీం జాఫర్ అంచనా మేరకు రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైఎస్ కెప్టెన్), చతేశ్వర పూజారా, విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్, కేఎస్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి ఉన్నారు.