West Indies vs India 1st Test : యువతకే పెద్దపీట.. ఇప్పటికైనా టీమిండియా తలరాత మారేనా..
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు బుధవారం సాయంత్రం తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో పలువురు యువ క్రికెటర్లు టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నారు. యంగ్ ప్లేయర్లతో అద్భుతాలు సృష్టించేందుకు అర్థమవుతున్న భారత జట్టుకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది.

West Indies vs India 1st Test : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ తీరు పూర్తిగా మారిపోయింది. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి యువకులతో కూడిన సరికొత్త టీమును సిద్ధం చేసేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించింది బీసీసీఐ. యువకులతో కూడిన భారత జట్టు ద్వారా మెరుగైన ఫలితాలను సాధించాలని బీసీసీఐ భావిస్తోంది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు బుధవారం సాయంత్రం తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో పలువురు యువ క్రికెటర్లు టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నారు. యంగ్ ప్లేయర్లతో అద్భుతాలు సృష్టించేందుకు అర్థమవుతున్న భారత జట్టుకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది.
యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు..
తొలి టెస్ట్ లో ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. వీరిలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే గిల్ వంటి ప్లేయర్లు టెస్టుల్లో తమ సత్తాను చాటే ఎందుకు సిద్ధమవుతున్నారు. ఇక మిగిలిన జట్టు విషయానికొస్తే రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, జడేజా, అశ్విన్, ఠాకూర్, షిరాజ్, ఉనాద్కత్ తొలి టెస్ట్ ఆడుతున్నారు. వరల్డ్ కప్ లక్ష్యంగా యువ జట్టును సిద్ధం చేస్తున్న భారత్ ఏ స్థాయిలో సత్ఫలితాలను సాధిస్తుందో చూడాల్సి ఉంది. గడిచిన 12 ఏళ్ల నుంచి ఐసీసీ నిర్వహించే ట్రోఫీలను సాధించలేక చతికల పడుతున్న భారత జట్టును యువ ఆటగాళ్లు ఎంతవరకు గాడిన పెడతారో చూడాల్సి ఉంది. యంగ్ ప్లేయర్స్ పై భారత గట్టు గంపెడు ఆశలు పెట్టుకుని ఉంది. భవిష్యత్ క్రికెట్ యువకులపైనే ఆధారపడి ఉందని భావిస్తున్న బీసీసీఐ.. అందుకు అనుగుణంగా వారికి అవకాశాలను కల్పించేందుకు సిద్ధమైంది. యువకులతో కూడిన జట్టు వల్ల అయినా భారత జట్టు తలరాత మారి.. 12 ఏళ్ల వరల్డ్ కప్ కల నెరవేరుతుందా..? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ కు ముందు ఆడుతున్న వెస్టిండీస్ పర్యటనలో యువ ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వరల్డ్ కప్ పై ఒక అంచనాకు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే తొలి టెస్టులో టాస్ గెలిచి భౌలింగ్ గెలుచుకున్న భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. 28 ఓవర్లు ముగిసే సమయానికి 68 పరుగులకు నాలుగు వికెట్లను పడగొట్టారు భారత బౌలర్లు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం లంచ్ సమాయానికి వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి 68 పరుగులతో ఆడుతోంది.
