TDP : టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ చైతన్య రథయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుకు గ్యారంటీ  జోన్-1 బస్సు యాత్ర కార్యక్రమం మూడవ రోజు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

  • Written By: NARESH
  • Published On:
TDP : టీడీపీ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ చైతన్య రథయాత్ర

TDP : ఉద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత కిమిడి నాగార్జున పేర్కొన్నారు.   తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలుపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం విజయనగరం పార్లమెంట్, చీపురుపల్లి నియోజవకర్గంలో బస్సుయాత్ర జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుకు గ్యారంటీ  జోన్-1 బస్సు యాత్ర కార్యక్రమం మూడవ రోజు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కిమిడి నాగార్జున గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

యాత్ర ఉదయం అచ్యుతాపురం జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఊపి బస్సు యాత్ర ప్రారంభించిన పార్టీ నాయకులు. అనంతరం గడిగెడ్డ రిజర్వాయర్ ను సందర్శించి సెల్ఫీ ఛాలెంజ్ చేసారు. మరియు గరివిడి లో ఉన్న వెటర్నరీ కళాశాలను సందర్శించారు. భోజన విరామం అనంతరం చీపురుపల్లి లో గల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని సందర్శించిన పార్టీ నాయకులు, గరివిడి, రేగటి, చినబంటుపల్లి మీదుగా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామంలో నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు , శ్రీ కిమిడి కళా వెంకటరావు, శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, కొండ్రు మురళీమోహన్, డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు, మాజీ స్పీకర్ శ్రీమతి కావాలి ప్రతిభా భారతి, నియోజకవర్గ ఇంచార్జి లు శ్రీమతి కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ టెంటు లక్ష్ము నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, ముఖ్య నాయకులతో పాటు నియోజకవర్గం లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జోన్ 2 భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్ర గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది.

గురువారం ఉదయం పిఠాపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ రథయాత్ర నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి, మాజీ మంత్రి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అక్కడ నుండి ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ హార్బర్ సందర్శించి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అక్కడ నుండి ఉప్పాడ బీచ్ లో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని సందర్శించి పిఠాపురం మెయిన్ రోడ్ లోని అంబేద్కర్ సెంటర్లో విగ్రహానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ధకు చేరుతుకు నివాళులర్పించారు. గొల్లప్రోలు సుద్దగడ్డ సందర్శించి అనంతరం పిఠాపురం టౌన్ బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద సాయంత్రం 3.30 గం.లకు బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సభలో కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ

వైసీపీ రాక్షస పాలనలో ఎన్నో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పారు. టిడిపిని ఇబ్బంది పెట్టాలని, చంద్రబాబును వేధించాలని జగన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడని, అయినప్పటికీ కార్యకర్తల అండతో తిరిగి టిడిపి నిలదొక్కుకుందని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి స్వర్ణయుగం చూపించారని చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. 2019 ఎన్నికలలో జగన్ రెడ్డికి ఓట్లేసి ప్రజలు తప్పు చేశారని ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తికి అధికారం కట్టబెట్టడం తప్పు కాదా అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికలలో ఎక్కడికి వెళ్ళినా నా ఎస్సీలు, నా బిసిలు అని చెప్పిన జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఎస్సీ, బిసిల సంక్షేమానికి ఎగనామం పెట్టాడని ఆయన విమర్శించారు. ఎస్సీ, బిసిలను వేధించడానికి వైసీపీ నేతలు పోటీ పడుతున్నారని విమర్శించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన నివేదికలో ఎస్సీ, ఎస్టీ, బిసిలపై వేధింపుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏటా ఐదు లక్షల ఇళ్ళు నిర్మిస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఆ లెక్కన ఈ నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్ళు కట్టాలని, కానీ 20 ఇళ్ళు కూడా జగన్ రెడ్డి కట్టలేదని ఆయన ఆరోపించారు. దశల వారీగా మద్యనిషేధం చేస్తానని మహిళలను మోసగించిన జగన్ రెడ్డి బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అమ్మి ఏటా 26 వేల కోట్ల ఆదాయం లాక్కుంటున్నాడని మండిపడ్డారు. మద్యం, ఇసుక అక్రమ అమ్మకాలతో సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు తరలించుకుపోతున్నాడని ఆయన ఆరోపించారు. ఇటువంటి మోసగాడిని గద్దె దించడమే కాదు… వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాజమండ్రి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీగా మారిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ఎక్కడ ఇసుక దొరుకుతుంది.. ఎక్కడ కబ్జాకు భూములు దొరుకుతాయని వెదుక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే దోపిడీపై పత్రికల్లో వస్తున్న కథనాలను ఆయన ఉదహరించారు. “ఈ రాష్ట్రం గెలవాలంటే టిడిపి గెలవాలి.. బిసిలు గెలవాలంటే టిడిపి రావాలి.. ఎస్సీలు గెలవాలంటే టిడిపి రావాలి. చంద్రబాబు గెలవడం ఇప్పుడు చారిత్రక అవసరం” అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు మహిళాశక్తి, యువతకు యువగళం, రైతులకు అన్నదాత, బిసిలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్.. ఇలా అందరికీ సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన చంద్రబాబును గెలిపించుకోవాలని ఆయన కోరారు. పిఠాపురం నుండి పిలుపునిస్తున్నాం… రండి.. కదలిరండి.. అని ఆయన పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురం నుండి తడ వరకూ ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉందన్నారు. ఇటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి పాలనలో ఉండడం మన దురదృష్టమన్నారు. అందరూ లిస్టులు రాయండి.. వైసీపీ వాళ్ళకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. ఆ సెటిల్మెంట్లు పూర్తయ్యాకే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చక్కబెడదామని అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పిఠాపురంలో రికార్డు స్థాయి మెజారిటీతో వర్మ గెలుపు ఖాయమని చెప్పారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ

సంపదను సృష్టించి సంక్షేమం పేరిట ప్రజలకు పంచడం చంద్రబాబుకు తెలిస్తే, సంపదను దోచుకోవడం జగన్ రెడ్డికి తెలుసునని చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల తీరప్రాంతాన్ని జగన్ రెడ్డి తన అనుచరగణానికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. గుజరాత్ తదితర రాష్ట్రాలలో కాలుష్యకారక పరిశ్రమలు లేవని, కానీ మన తూర్పుతీరంలో ఈ పరిశ్రమలకు స్వాగతం పలుకుతున్నాడని మండిపడ్డారు. డ్రగ్స్ కంపెనీలు, ఇతర కాలుష్యకారక కంపెనీలు మన తీరంలో రావడం వల్ల ప్రజలు ఆరోగ్యం కోల్పోతున్నారని, మత్స్య సంపద కోల్పోతున్నామని చెప్పారు. తమిళనాడులో చేపలు పడుతున్నాయి… కేరళలో చేపలు పడుతున్నాయి.. కానీ మన తీరంలో మత్స్య సంపద ఏమవుతుందో అర్ధం చేసుకోవాలని చెప్పారు. పిఠాపురంలో వర్మను గెలిపించుకోవాలని కోరారు. ఎవరెంత మంది జనాభా ఉన్నాంc అని కాదు.. ఎవరు కష్టపడి మనకు సేవ చేస్తారో చూసుకోవాలని సూచించారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ

టిడిపి ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తే.. వైసీపీ పాలకులు బూతుల మంత్రులుగా మారారని ఆమె మండిపడ్డారు. అవ్వ తాతల బుగ్గలు నిమిరి వృద్ధాప్య పింఛన్ రూ.3000 చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు పెంచుకుంటూ పోతానంటూ దశల వారీగా రూ.2750 చేశాడని విమర్శించారు. ఇది మాట తప్పి.. మడమ తిప్పడం కాదా అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో టిడిపిని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని, పిఠాపురంలో వర్మను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని అనిత పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, బిసి ఫెడరేషన్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపిని గెలిపించుకోవాలని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిఠాపురానికి టిడిపి హయాంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫిషింగ్ హార్బర్ ఇచ్చామని, వాటిని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. వైసీపీ పాలనలో బిసి సంక్షేమం కొడిగట్టిందని విమర్శించారు. బిసి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైసీపీ పాలకులు ఒక్క సామాన్య బిసికి కూడా ఒక్క రుణం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ సాగిస్తున్న అరాచక పాలనకు త్వరలో చరమగీతం పాడదామని పిలుపునిచ్చారు.

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ

నాలుగేళ్ల వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఇటు చంద్రబాబు, అటు లోకేష్ బాబు చేస్తున్న పోరాటం ప్రజలలోకి వెళ్ళిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకువెళ్ళాలని ఆయన కోరారు.

టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ *

టిడిపి మినీ మేనిఫెస్టోను వైసీపీ నుండి కాపీ కొట్టామని పేటిఎం బ్యాచ్ చేస్తున్న విమర్శలను తిపికొట్టారు. సంక్షేమ పథకాలు పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుండి అని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, చంద్రబాబు అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమం పంచుతారని చెప్పారు.

పిఠాపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిబాబు, పెందుర్తి వెంకటేష్, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, కాకినాడ రూరల్ టిడిపి నాయకులు పెంకే శ్రీనివాసబాబా, వాసిరెడ్డి ఏసుదాసు, పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

జోన్ – 4 చిత్తూరు పార్లమెంట్, పూతలపట్టు నియోజకవర్గం లో ఈరోజు తలపెట్టిన బస్సు యాత్ర అట్టహాసంగా జరిగింది..

కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత జెండా ఆవిష్కరించి, అగరంపల్లి వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడ నుంచి జెండా ఊపి బస్సు ని బయలుదేరి, అక్కడ నుంచి తిరణం పల్లి లో మహిళలు ఘన స్వాగతం పలికారు తదనంతరం, మద్ది పట్లపల్లి గ్రామంలో అతిధులకు సన్మానాలు, ఇదే గ్రామంలో స్కూల్ భవనం పెచ్చులూడిపోతున్న వాటిని ఇంచార్జ్ సెల్ఫీ తీసి నాడు నేడు ఇదేనా అని జగన్ కు సవాల్ విసిరారు, తదనంతరం చింతగుమ్మ పల్లెలో గ్రామ దేవత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు, తర్వాత వైఎస్ గెట్ లో జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు, రత్నగిరి గ్రామంలో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు తదనంతరం హంద్రీనీవా కాలువ దుస్థితిని సెల్ఫీ తీసి చాలెంజ్ విసిరారు, ఐరాలలో ఘన స్వాగతం కేరళ డ్రమ్స్, మేళ్ల వాయిద్యాలతో, కోలాట్లతో, భజనలతో స్వాగతం పలికారు, అదే గ్రామంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణలు చేశారు, అదే దారిలో వరి నాట్లు వేస్తున్న కూలీలతో కొంతసేపు నాయకులు ముచ్చటించారు, ఐరాల మసీదులో అల్లా ఆశీర్వాదాలు పొందారు, పేరయ్య గారి పల్లె బస్సు యాత్ర ప్రతినిధులకు అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు, ఇరువారం పల్లిలో గుమ్మడికాయలతో తీసి స్వాగతం పలికి సందడి చేశారు, తదుపరి ఎల్లంపల్లిలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో,మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, పరసారత్నం, సుగుణమ్మ, బి ఎన్ రాజసింహులు, నరసింహ యాదవ్, కోదండ యాదవ్, గిరిధర్ బాబు, ఎన్ పీ జయప్రకాష్, మనీ నాయుడు కాణిపాక టెంపుల్ మాజీ చైర్మన్, వెంకటేశ్వర చౌదరి మాజీ జెడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి, దిలీప్ చౌదరి, మురార్జీ, అరుణ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు, లతా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, ధరణి ప్రకాష్ బీసీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు, మధుసూదన్ రావు నియోజకవర్గ ట్రేడ్ సెల్ అధ్యక్షులు, శ్రీధర్ వర్మ, తదితర నాయకులు పాల్గొన్నారు.

జోన్ 5 పరిధిలోని కర్నూలు పార్లమెంట్, ఆదోని నియోజకవర్గం నుందు నియోజకవర్గం ఇంచార్జీ శ్రీ కె.మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఇంచార్జీ శ్రీ కె.మీనాక్షి నాయుడు గారు పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనాయకులు, స్థానిక నాయకులతో కలిసి గుమ్మడి కాయ కొట్టి హారతి ఇచ్చి బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది. బస్సు యాత్ర ప్రారంభం నుండే భారీ ఎత్తున సుమారు 1000 మోటార్ సైకిల్ లతో ర్యాలి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం మొడలు అయినపటి నుంచి కూడా మొటర్ సైకిల్ ర్యాలీ బస్సు కు ముందుగా వెళ్ళడం జరిగింది. నారాయణపురం గ్రామం దెగ్గర స్థానిక కార్యకర్తలతో సమావేశం అనంతరం ధనాపురం గ్రామం చెరుకొని అక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశం కావడం జరిగింది. అనంతరం ఆదోని – మంత్రాలయం రహదారిపై టిడిపి హయాంలో కట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ను చూపెడుతూ నాయకులు సెల్ఫీ తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి పట్టణంలో డాక్టర్ బి.ఆర్.అంబెద్కర్, పొట్టి శ్రీరాములు, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు గౌ,, శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలకు నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. డా.బి.ఆర్.అంబెద్కర్ విగ్రహం వద్ద నాయకులు అక్కడికి చేరుకొన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అక్కడ నుండి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్సించిన అనంతరం దివాన్ సాహెబ్ తిక్కస్వామి దర్గాను సందర్శించి అక్కడ ముస్లిం సోదరులతో సమావేశం కావడం జరిగింది. అనంతరం కపటి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాత్లాడటం జరిగింది.కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకు కూడా బస్సు కు ముందుగా మొటార్ సైకిళ్ళు ర్యాలీ గా రావడం చాలా బాగుంది. కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జరిగింది. కార్యక్రమం ప్రతి పాయింట్ దగ్గర భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, యం.ఎల్.సి బి.టి.నాయుడు, యం.యల్.సి ఎన్.ఎం.డి ఫరూక్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, మాజి మంత్రివర్యులు కె.ఇ.ప్రభాకర్, మాజి మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జీలు కె.ఇ.శ్యాం కుమార్ (పత్తికొండ), ఆకేపోగు ప్రభాకర్ (కోడుమూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కోట్ల సుజాతమ్మ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.భూపాల్ చౌదరి, నియోజకవర్గం ముఖ్య నాయకులు కె.ఉమాపతి నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పి.జి.నరసిమ్హులు యాదవ్, నంద్యాల నాగేంద్ర, యాదవ్, పి.జి.రాంపుల్లయ్య యాదవ్, మాజి ఫుడ్ కార్పోరేషన్ సభ్యురాలు గుడిసె క్రిష్ణమ్మ, పార్లమెంట్ అనుబంధ కమిటీ అధ్యక్షులు అఫ్సర్ బాష (మైనారిటి) రామాంజనేయులు (టి.ఎన్.ఎస్.ఎఫ్), షేక్ ముంతాజ్ (మహిళా) ఆది శేషి రెడ్డి (రైతు) రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు అల్తాఫ్ (మైనారిటీ కమిటీ), పెద్ద అయ్యన్న (రైతు కమిటీ) మొదలగు వారితో పాటు అన్ని మండలాల మండలపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు