Pawan Kalyan Chiranjeevi: ప్రజారాజ్యం కు.. జనసేనకు చాలా తేడా ఉంది. నాటి కుట్రల్లో చిరంజీవి బలైపోగా.. అవే కుట్రలను ఎదురించి మొండిగా నిలబడుతున్నాడు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యంలా జనసేనను కానీయదలుచుకోలేదు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి చాలా స్పష్టంగా ముందుకెళుతున్నాడు. ఇప్పటికే జూలై కల్లా పార్టీ నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాడు. పెద్ద ప్రణాళికతో అన్ని జిల్లాలు టూర్లు చేయబోతున్నాడు. కౌలు భరోసా పేరుతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాడు. రచ్చబండ కార్యక్రమం ప్రజల్లో జనసేనాని పవన్ కు మంచి ఇమేజ్ ను తెచ్చిపెడుతోంది.
ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లోని కొత్త కోణాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వేరు.. పవన్ కళ్యాణ్ వేరు అన్న ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టడం.. నాదెండ్ల మనోహర్ వెళ్లి మాట్లాడారు.
ఇక తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, సోదరీమణులు కలిసి కౌలు రైతుల కోసం రూ.35 లక్షల విరాళాన్ని జనసేనకు ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ వితరణ చేయడంతో చిరంజీవి వేరు.. పవన్ కళ్యాణ్ వేరు అన్నది ఇక్కడ లేదని తేలిపోయింది.
చిరంజీవికి ఇష్టం లేకుండా నాగబాబు వచ్చి పవన్ కళ్యాణ్ వెంట ఉంటాడా? చిరంజీవి చెల్లెల్లు వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా లక్షలు విరాళంగా అందజేస్తారా? చిరంజీవియే ఈ మొత్తం ఇచ్చాడన్న పేరు ఉంది. ఆయన కూడా సపరేట్ గా ఇచ్చి ఉండొచ్చు కూడా.
టీడీపీ విశ్లేషకులు చిరంజీవిని.. పవన్ కళ్యాణ్ ను వేరువేరుగా చూపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలికంగా ఆనందంగా దొరికినా చిరంజీవి పవన్ కళ్యాణ్ వెనుక ఉంటాడన్నది వాస్తవం. రాజకీయాలు మానేసినా తమ్ముడు పవన్ విజయం సాధించాలని పవన్ కోరుకుంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
మెగా ఫ్యామిలీపై జరుగుతున్న కుట్రలపై ‘రామ్ ’ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..