Jr NTR: ఎన్టీఆర్ వస్తాడా రాడా? ఇప్పుడిదే అతిపెద్ద చర్చ!
అలాగే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తర్వాత సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైఫల్యం అనంతరం టీడీపీలో ఎన్టీఆర్ వర్గం అనేది ఒకటి ఏర్పడింది.

Jr NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు టీడీపీ వర్గాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. మొన్న విజయవాడ వేదికగా అట్టహాసంగా జరిపారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మే 20న హైదరాబాద్ లో మరో సభ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కి సైతం ఆహ్వానం లభించింది. టీడీపీ నేతలు స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయన్ని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన వస్తారా లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ని పిలవలేదు.
అలాగే చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్ తర్వాత సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైఫల్యం అనంతరం టీడీపీలో ఎన్టీఆర్ వర్గం అనేది ఒకటి ఏర్పడింది. టీడీపీ భవిష్యత్ ఎన్టీఆర్ తోనే సాధ్యం. ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇది నచ్చని చంద్రబాబు ఎన్టీఆర్ ని టీడీపీకి మరింత దూరం పెట్టే చర్యలకు పాల్పడ్డారనే వాదనలు వినిపించాయి. టీడీపీలోని జూనియర్ అభిమానులు చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు.
ఆయన సభల్లో ఎన్టీఆర్ ప్లాగ్స్ వెలుస్తున్నాయి. సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ తో బాలయ్యకు కూడా సత్సంబంధాలు లేవు. టీడీపీ చర్యలను గమనిస్తూనే ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుపోతున్నాడు. 2009 తర్వాత టీడీపీ పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొనలేదు. మరి ఈసారి ఆయన హాజరవుతారా? చంద్రబాబు, బాలయ్యలతో వేదిక పంచుకుంటారా? అనేది చూడాలి.
ఒక విధంగా ఇది ఎన్టీఆర్ కి సంకట పరిస్థితి. వెళితే తన పట్టుదల వీడినట్లు అవుతుంది. వెళ్లకుంటే తాతయ్య కోసం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యక్రమానికి ఎన్టీఆర్ రాలేదని ఎద్దేవా చేస్తారు. చంద్రబాబు వర్గానికి ఇది ఆయుధంలా మారుతుంది. జూనియర్ ని టీడీపీకి దూరం చేసేలా నాయకులతో విమర్శల దాడి చేయించే అవకాశం ఉంది. నారా భువనేశ్వరిని వైసీపీ నాయకులు కించపరిచారనే విషయంలో ఇదే జరిగింది. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మే 20 ఆయన బర్త్ డే కూడా… ఇక ఎన్టీఆర్ నిర్ణయం ఏమిటో చూడాలి.
