Majja Srinivasa Rao : చిన్న శ్రీనును నియంత్రించే పనిలో టిడిపి
బొత్స కుటుంబంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే టిడిపి వైపు చూస్తున్నట్లు టాక్ నడిచింది.ఇప్పుడు కానీ మజ్జి శ్రీనివాసరావును కోడి కత్తి కేసులో కార్నర్ చేస్తే నియంత్రించడం సాధ్యమని టిడిపి భావిస్తోంది.

Majja Srinivasa Rao : విజయనగరం జిల్లాలో ఆ నేత తెర వెనుక ఉండి పని చేసేవారు. గత ఎన్నికల ముందు తెర తీశారు. ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాప్రతినిధిగా మారారు. ఆయన ప్రతి అడుగు వ్యూహాత్మకమే. వ్యూహలు రూపొందించడంలో దిట్ట. గత ఎన్నికల్లో వైసిపి స్వీప్ చేయడానికి తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపించారు. ఈసారి కూడా అదే వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి ఆయన పై ఫోకస్ పెంచింది. ఆయన వ్యూహాలకు విరుగుడు చర్యలు ప్రారంభించింది. ఇంతకీ ఆ నేత ఎవరంటే మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శీను.
జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు మంత్రి బొత్సకు స్వయాన మేనల్లుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మామకు తగ్గ అల్లుడు. మామ రాజకీయ ఉన్నతికి.. బొత్స కుటుంబ హవాకు మజ్జి శ్రీనివాసరావు వ్యూహాలే కారణం.2019 ఎన్నికల ముందు బొత్స కుటుంబం వైసీపీలోకి వచ్చింది. జగన్ పాదయాత్రను ఉత్తరాంధ్రలో పర్యవేక్షణ బాధ్యతలు చిన్న శ్రీను చూశారు. విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జగన్ పాదయాత్ర సక్సెస్ వెనుక చిన్న శ్రీను హస్తం ఉంది. ఈ తరుణంలోనే జగన్ పై దాడికి కోడి కత్తిని సమకూర్చింది మజ్జి శ్రీనివాసరావేనని ఒక ఆరోపణ వచ్చింది. అయితే ఇది వ్యూహాత్మకంగా చేసిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
బొత్స కుటుంబాన్ని నియంత్రిస్తే తప్ప విజయనగరంలో పట్టు దొరకదని టిడిపి భావిస్తోంది. ఇటీవల బొత్స కుటుంబంలో విభేదాలు వెలుగు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో చిన్న శ్రీను పై పట్టు బిగిస్తే పూర్వ వైభవం సాధించవచ్చు అని టిడిపి భావిస్తోంది. అందుకే కోడి కత్తి కేసులో చిన్న శ్రీను పేరు తెరపైకి వచ్చింది. దీనిపైనే విస్తృత ప్రచారం చేయడానికి టిడిపి డిసైడ్ అయ్యింది. ఇప్పటికే జిల్లాలో తెలుగుదేశం పార్టీ పట్టు బిగిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాలను స్విప్ చేయాలని భావిస్తోంది. ఒక్క చిన్న శ్రీను నియంత్రిస్తేనే ఇది సాధ్యమని భావిస్తోంది.
కొద్దిరోజుల కిందట మజ్జి శ్రీనివాసరావు బావ అయినా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టిడిపికి టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది. బొత్స కుటుంబంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే టిడిపి వైపు చూస్తున్నట్లు టాక్ నడిచింది.ఇప్పుడు కానీ మజ్జి శ్రీనివాసరావును కోడి కత్తి కేసులో కార్నర్ చేస్తే నియంత్రించడం సాధ్యమని టిడిపి భావిస్తోంది. అయితే తన పేరు కోడి కత్తి కేసులో బయటికి రావడంతో మజ్జి శ్రీనివాసరావు అలర్ట్ అయ్యారు. ఆ కేసుతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.
