తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పక్కా ఆధారాలతో అరెస్టయి జైలుకు చేసిన విషయం తెలిసిందే. అతని పై సీబిఐ చాల పట్టు బిగించింది. బెయిల్ కోసం చాలా రోజులు పోరాడి ఎన్నో సార్లు భంగపడిన ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ ద్వారా బయటికి వచ్చారు. అయితే అతను వస్తున్న సందర్భంగా అనంతపురంలో అతని అభిమానులు ఎటువంటి భౌతిక దూరం పాటించకుండా వీరవిహారం చేసి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
ఇదే క్రమంలో చాలా నెలలు తర్వాత జైలులో ఉండి బయటికి వచ్చిన అత్యుత్సాహం ఏమో తెలియదు కానీ ప్రభాకర్రెడ్డి వచ్చీరాగానే పోలీసుల పైన విరుచుకు పడ్డారు. దళిత సీఐ దేవేంద్ర ని ఇష్టం వచ్చినట్లు దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఐదు కేసులు తాడిపత్రి పోలీసులు నమోదు చేశారు. కడప నుండి తాడిపత్రి దాకా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి పై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ మాజీ ఎమ్మెల్యేపై డిజాస్టర్ మేనేజ్మెంట్ 52 కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. ఇక దళిత సిఐ ని దూషిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న మాటలు వీడియో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా తాడిపత్రి లో 144 సెక్షన్ విధించారు. తాడిపత్రి లో భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. జైలు నుండి బయటకు వచ్చి 24 గంటలు కాకుండానే ప్రభాకర్ రెడ్డి మళ్ళీ పోలీసులు కస్టడీలోకి వెళ్లడం నిజంగా పెద్ద విశేషమనే చెప్పాలి.