TDP- JanaSena Alliance: పొత్తులపై టిడిపి, జనసేన ఎత్తుకు పై ఎత్తులు
TDP- JanaSena Alliance: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని భావిస్తున్న ప్రతిపక్షాలు.. వచ్చే ఎన్నికల్లో కలిసి వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుకు సిద్ధమవుతుండగా, ఇదే కూటమిలో వామపక్షాలను చేర్చుకోవాలని ప్రతిపాదన వినిపిస్తోంది. అయితే, జనసేన టీడీపీ మధ్య పొత్తు చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కలిసి వచ్చే ప్రణాళికలను సిద్ధం చేస్తుండగా.. అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ […]


pawan kalyan- chandrababu
TDP- JanaSena Alliance: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని భావిస్తున్న ప్రతిపక్షాలు.. వచ్చే ఎన్నికల్లో కలిసి వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుకు సిద్ధమవుతుండగా, ఇదే కూటమిలో వామపక్షాలను చేర్చుకోవాలని ప్రతిపాదన వినిపిస్తోంది. అయితే, జనసేన టీడీపీ మధ్య పొత్తు చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఒకవైపు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కలిసి వచ్చే ప్రణాళికలను సిద్ధం చేస్తుండగా.. అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. అయితే వైసిపి ప్రభుత్వం జనవరి నుంచి పెన్షన్ 3000 చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. ముందస్తు ఎన్నికలకు అవకాశం లేకపోవడంతోనే ప్రతిపక్షాల పొత్తు చర్చలను త్వరితగతిన పూర్తి చేయడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటే అందుకు అనుగుణంగానే పొత్తుల్లో భాగంగా సీట్లు పంపకాలను తేల్చి ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యేవి. కానీ అధికార పార్టీ నుంచి ఆ దిశగా సిగ్నల్స్ రాకపోవడంతో వీళ్ళు జాప్యం చేస్తున్నారు.
ఎవరి ఎత్తులు వారివి..
ముందస్తు ఎన్నికలకు వెళ్లడన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు పొత్తులు వ్యవహారాన్ని నత్త నడకన సాగిస్తున్నాయి. పవన్ కావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ.. తాము ఇచ్చిన సీట్లను మాత్రమే తీసుకోవాలని కోరుకుంటోంది. అయితే దీనికి జనసేన ఏమాత్రం సుముఖంగా లేదు. తాము అడిగిన అన్ని సీట్లు ఇవ్వడంతో పాటు అధికారంలో భాగం ఇవ్వాలని జనసేన కోరుకుంటోంది. ఇక జనసేన, టిడిపి తో కలిసి వెళ్లాలని భావిస్తున్న కమ్యూనిస్టులు బిజెపి రాకుండా ఉండాలని భావిస్తున్నాయి. అయితే బిజెపిని కలుపుకుని అవసరమైతే కమ్యూనిస్టులను పక్కన పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఇలా ఎవరి ఎత్తులు వారికి ఉండడంతో పొత్తు చర్చలు ముందుకు సాగడం లేదన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.

pawan kalyan- chandrababu
బిజెపి, జనసేన వైపు టిడిపి చూపు..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు నాయుడు.. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుతో పటిష్టంగా మారిన జనసేన పార్టీతో పొత్తు వల్ల ఓట్లు పరంగా లాభం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అలాగే ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ బీజేపీతో పొత్తు వలన వచ్చే ఎన్నికల్లో అధికార పరంగా కేంద్రం నుంచి మేలు జరుగుతుందని భావిస్తున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల మాదిరిగానే బిజెపిని కలుపుకొని 2024 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఆ దిశగా చంద్రబాబునాయుడు పావులు కదుపుతుండడం వలనే పొత్తు చర్చలు ముగింపు దశకు రావడం లేదు. ఒకవేళ బిజెపి పొత్తుకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోతే కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. కమ్యూనిస్టులు మాత్రం బిజెపి దగ్గరకు రాకుండా జనసేన, టిడిపితో ముందుకు వెళ్లి పొత్తులో భాగంగా నాలుగు సీట్లు, ఒక మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.
ముందస్తుకు వెళితే వైసీపీకి కలిసివచ్చేనా..
మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మూడు వేల రూపాయల పెన్షన్ పెంపు జనవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉందని వైసిపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో ముందస్తు ఎన్నికలకు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు.
సంక్షేమమే అజెండాగా వైసిపి..
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సంక్షేమ అజెండాగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు అభివృద్ధి చేశాడన్న విషయాన్ని ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వము గ్రామస్థాయిలో సచివాలయాలు, ఆర్.బి.కెలు, నాడు నేడు లో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి వంటి అనేక పనులు చేసినప్పటికీ వీటిని ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా వచ్చే ఎన్నికలకు సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.