Taxi Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిష్యుడు ” హరీష్ సజ్జా ” దర్శకత్వంలో… వస్తున్న చిత్రం ” ట్యాక్సీ “. ‘ హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ ‘ బ్యానర్ పై హరిత సజ్జ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వసంత్ సమీర్, సౌమ్య మీనన్ , ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు హరీష్ పలు సినిమాలకు పనిచేయగా… ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
అలానే బిక్కి విజయ్ కుమార్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలానే మార్క్ రాబిన్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కానుంది. వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను… ఇండియా , పాకిస్థాన్ మ్యాచ్ కానుకగా తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ఓ గన్ పై కార్ ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో వైజాగ్ సిటీ మ్యాప్ కూడా కనిపిస్తుండడం… ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పాలి. అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , ప్రవీణ్ యండమూరి, గల్లీ బాయ్ సద్దాం హుస్సేన్, నవీన్ పండిత… పలువురు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఉరుకుండారెడ్డి ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్ పల్లకి వి.ఎఫ్ ఎక్స్ అందిస్తుండగా… టి.సి.ప్రసన్న ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమా ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుందని మూవీ యూనిట్ చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.