Texas Mall Shooting: సీఈవో అయ్యే ప్రతిభ ఉన్న అమ్మాయి.. కాల్పుల్లో మరణించింది..

సూర్యపేట జిల్లా నేరేడు చర్ల గ్రామానికి చెందిన తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఐశ్వర్య. పలు కారణాల వల్ల హైదరాబాద్ కు వీరు షిప్ట్ అయ్యారు. దీంతో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని మాతృశ్రీ కళాశాలలో ఐశ్వర్య ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

  • Written By: SS
  • Published On:
Texas Mall Shooting: సీఈవో అయ్యే ప్రతిభ ఉన్న అమ్మాయి.. కాల్పుల్లో మరణించింది..

Texas Mall Shooting: ఉన్నతాశయాలతో చదువును పూర్తి చేసింది.. ఆ తరువాత తన కలను సాకారం చేసుకునేందుకు మార్గం ఏర్పరుచుకుంది.. అనుకున్నట్లుగానే ఆమె అనుకున్నది సాధించే రోజొచ్చింది.. ఉన్నతస్థానంలో కూర్చునేందుకు ఏర్పాట్లు చేసుకుంది.. అంతలోనే.. విధి విషనాగైంది. కాల్పుల రూపంలో కాటేసింది.. అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో మృతి చెందిన తాటికొండ ఐశ్వర్య కుటుంబ సభ్యులను తీవ్ర శోకంలోకి నెట్టింది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న ఆమె ఆశ ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చివరి మెట్టు వరకు వచ్చిన ఆమె మరికొన్ని రోజులు గడిస్తే ఓ కంపెనీకి సీఈవోగా బాధ్యతలు తీసుకుంటారు. కానీ ఈ సమయంలోనే కాల్పులకు బలైంది. అంతేకాకుండా మే 18న ఆమె బర్త్ డే. ఈ సారి ఆమె బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు కంపెనీ నిర్వాహకులు సైతం ఘనంగా ఏర్పాట్లు చేశారు. కానీ అంతలోనే విషాదం.

సూర్యపేట జిల్లా నేరేడు చర్ల గ్రామానికి చెందిన తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఐశ్వర్య. పలు కారణాల వల్ల హైదరాబాద్ కు వీరు షిప్ట్ అయ్యారు. దీంతో హైదరాబాద్ లోని సరూర్ నగర్ లోని మాతృశ్రీ కళాశాలలో ఐశ్వర్య ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికాకు వెళ్లారు. అక్కడ ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని గ్రాండ్ స్కూల్ లో కన్ స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత టెక్సాస్ లోని పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు.

ఈ తరుణంలో మే 6న ఐశ్వర్య తన గదిలోకి రాకపోవడంతో ఆమె స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఆమె కోసం వివిధ ఆసుపత్రులకు తిరిగిన ఆచూకీ లభించలేదు. చివరికి కొలిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయంలో విచారణ చేయడం ద్వారా ఐశ్వర్య గురించి విచారకరమైన వార్త వినాల్సి వచ్చిందని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సభ్యుడు అశోక్ కొల్లా ఫాక్స్ 4 డల్లాస్ పోర్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె మరణించినందని తెలిసిన తరువాత స్నేహితులతో పాటు తోటి ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య గురించి ఫర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ ఎల్ఎల్ సి ప్రెసిడెంట్ శ్రీనివాస్ చలువూడి సీబీఎన్ తో మాట్లాడారు. ఐశ్వర్య వర్క్ విషయంలో ఫ్రాంట్ గా ఉండేవారని, ఆమె తనకు వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరంగా ఉండిపోవాలని అనుకుందని తెలిపారు. ఐశ్వర్యకు ఉన్న ప్రతిభతో మా కంపెనీకి ఆమెను సీఈవో చేయాలని అనుకున్నామని, ఇందు కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఆమె నా కూతురు లాంటిదని, ఆమె మరణం గురించి తెలిసి తీవ్రంగా బాధపడ్డానని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఐశ్వర్య బర్త్ డే మే 18. ఈ సందర్భంగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేశామన్నారు. కానీ ఇంతలోనే విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని శ్రీనివాస్ చలుపూడి అన్నారు.

ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. లాంఛనాలు పూర్తయిన తరువాత ఆమె దేహాన్ని భారత్ కు పంపుతామని సీజీఐ తెలిపారు. అలాగే అమెరికా అధికారుతో ఆమె దేహాన్ని తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులతో టచ్ లో ఉన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ సంఘటనపై పర్యవేక్షిస్తున్నారని, భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు నుంచి ఎప్పటికప్పుడు వాకాబు చేస్తున్నారని నర్సిరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు