Tasty Teja: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగానే టేస్టీ తేజ చేసిన పని వైరల్

యూట్యూబర్ అంటే ఏదో ఆశామాషి అనుకుంటున్నారా.. తమిళ్, తెలుగు,మలయాళం ,కన్నడ భాషల నుంచి వచ్చిన సుమారు 150కు పైగా చిత్రాలను అతను తన యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేశాడు. బేసిగ్గా ఫుడ్ యూట్యూబ్ అయిన టేస్టీ తేజ..

  • Written By: Vadde
  • Published On:
Tasty Teja: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టగానే టేస్టీ తేజ చేసిన పని వైరల్

Tasty Teja: ఏడు సంవత్సరాల నుంచి బుల్లితెరపై తన హవాను ఏ మాత్రం తగ్గించకుండా నెంబర్ వన్ షోగా దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రత్తి సీజన్ కి ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావడమే కాకుండా…ఎన్నో ట్విస్టులతో ఆద్యంతం ఎంటర్టైన్ చేసే ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తారు.

పైగా ఇందులో వచ్చే కంటెస్టెంట్స్ అటు సీరియల్స్ లేక సినిమాలలో బాగా తెలిసిన వాళ్లే కావడంతో ఇట్టే వాళ్లకు కనెక్ట్ అయిపోవడమే కాకుండా ,హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని అదేదో వాళ్ళ ఇంట్లో జరిగిన విషయంలో చూస్తారు. అందుకే బిగ్ బాస్ కి అంత పాపులారిటీ వచ్చింది మరి. హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ చాలా వరకు బుల్లితెర నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు…మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే కంటెస్టెంట్స్ అయితే వాళ్లకుండే పాపులారిటీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇంకొంతమంది బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తరువాత పాపులర్ అయిన వ్యక్తులు ఉన్నారు.

అయితే ప్రస్తుతం నిన్న మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తర్వాత హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా టేస్టీ తేజ గురించి పలు రకాల విషయాలు తెలుస్తున్నాయి. రీసెంట్ గా టేస్టీ తేజ అనే యూట్యూబ్ ఛానల్ తో సినిమా ప్రమోషన్లు సైతం చేస్తూ బాగా బిజీ అయిన వ్యక్తి ఇంతకుముందు జబర్దస్త్ లో కనిపించాడు.

యూట్యూబర్ అంటే ఏదో ఆశామాషి అనుకుంటున్నారా.. తమిళ్, తెలుగు,మలయాళం ,కన్నడ భాషల నుంచి వచ్చిన సుమారు 150కు పైగా చిత్రాలను అతను తన యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేశాడు. బేసిగ్గా ఫుడ్ యూట్యూబ్ అయిన టేస్టీ తేజ.. ఇలా ఎక్కువ సినిమాలు చేసిన ఏకైక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్గా గా నేషనల్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పైగా ఇతని కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఎంతైనా జబర్దస్త్ నుంచి వచ్చాడు కదా.. ఆ వాసన ఎక్కడికి పోతుంది.

అందుకే హౌస్ కి ఎంట్రీ ఇవ్వడంతోటే తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఎంటర్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ లో అడుగు పెట్టి పెట్టగానే కడుపుబ్బ నవ్వించి ఫస్ట్ ఇంప్రెషన్ ని సంపాదించుకున్నాడు టేస్టీ తేజ. ఇప్పటివరకు యూట్యూబ్లో టేస్టీ… టేస్టీ ఫుడ్స్ తో అందరినీ అలరించిన ఇతను ఇప్పుడు బిగ్ బాస్ లో మంచి టేస్టీ జోక్స్ తో ఇంకా అలరిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు