Tarun Mother Roja Ramani: తరుణ్ పెళ్లి… కన్నీరు పెట్టిస్తున్న అమ్మ కామెంట్స్!

నువ్వే కావాలి అనంతరం ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి హిట్ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సక్సెస్ఫుల్ టైర్ టు హీరోగా టాలీవుడ్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు.

  • Written By: SRK
  • Published On:
Tarun Mother Roja Ramani: తరుణ్ పెళ్లి… కన్నీరు పెట్టిస్తున్న అమ్మ కామెంట్స్!

Tarun Mother Roja Ramani: హీరో తరుణ్ ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా పడిపోయాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టిన తరుణ్ సంచలనాలు చేశాడు. నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరను దున్నేసిన తరుణ్ 2000లో హీరోగా మారాడు. ఉషా కిరణ్ బ్యానర్లో నువ్వే కావాలి చిత్రంతో హీరో అయ్యాడు. నువ్వే కావాలి అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

నువ్వే కావాలి అనంతరం ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి హిట్ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సక్సెస్ఫుల్ టైర్ టు హీరోగా టాలీవుడ్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. బిజీ హీరోగా వరుస చిత్రాలు చేశారు. స్క్రిప్ట్ సెలక్షన్ లో తడపడ్డ తరుణ్ మెల్లగా ప్లాప్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక దశలో తరుణ్ సినిమాలన్నీ పరాజయం పొందాయి. దాంతో ఆయన కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది. 2014లో చేసిన వేట అనంతరం నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. 2018లో ఇది నా లవ్ స్టోరీ అంటూ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. ఇది కూడా ప్లాప్ అయ్యింది.

తరుణ్ కెరీర్ ఇక ముగిసిందని వార్తలు వస్తుండగా ఆయన తల్లి గారు రోజా రమణి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తరుణ్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోజా రమణి మాట్లాడుతూ… మా అబ్బాయి మీద అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అవి వింటే బాధేస్తుంది. తరుణ్ ఓ వెబ్ సిరీస్, సినిమా చేస్తున్నారు. ఈ రెంటిలో ఏది ముందు వస్తుందో చెప్పలేను. తరుణ్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీ ఆశీస్సులతో రీ ఎంట్రీ అద్భుతంగా ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు.

తరుణ్ కి భక్తి ఎక్కువ. ప్రతి రోజూ ఉదయం గంటన్నర పూజ చేస్తాడు. శని, మంగళవారాలు నాన్ వెజ్ ముట్టుకోడు. ప్రతి ఏడాది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటాడు. నా కంటే తరుణ్ కి ఎక్కువ భక్తి. తరుణ్ కి పెళ్ళైతే చాలు. అదే నేను కోరుకునేది అన్నారు. తరుణ్ ప్రస్తుతం థర్టీ ప్లస్ లో ఉన్నారు. ఈ క్రమంలో తల్లి రోజా రమణి కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రోజారమణి స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నటిగా కూడా రాణించారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు