NTR Vs ANR: టాలీవుడ్ కి ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు కళ్లంటారు. తమ స్టార్ డమ్ తో తెలుగు సినిమా మార్కెట్ పెంచిన హీరోలు వీరిద్దరూ. సినిమాల విషయంలో ఎవరి శైలి వారిది. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో నన్ను కొట్టేవాడు లేడని నిరూపించుకుంటే… రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ లో తనకు సాటి లేరని ఏఎన్నార్ రుజువు చేశారు. గొప్ప విషయం ఏమిటంటే.. స్టార్ హీరోలుగా ప్రధాన పోటీ తమ మధ్యే ఉండేది. ఫ్యాన్ వార్స్ కూడా జరిగేవి. అయినప్పటికీ కలిసి చిత్రాలు చేసేవారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాంబినేషన్ లో దాదాపు 15 మల్టీస్టారర్స్ వచ్చాయి. వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. వారు కలిసి చేసిన మిస్సమ్మ, గుండమ్మ కథ ఎవర్గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.

NTR Vs ANR
ఒక ఆరోగ్యకరమైన పోటీ వారి మధ్య నడిచింది. ఎంత గొప్ప మిత్రులైనప్పటికీ ఏదో ఒకరోజు దూరమయ్యే పరిస్థితి రావచ్చు. అది వారి ప్రమేయం లేకుండా కూడా జరగొచ్చు. ఎన్టీఆర్ తో ఏఎన్నార్ కి మనస్పర్థలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాక ఎన్టీఆర్ కాస్త దూకుడుగా ప్రవర్తించాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్.. అక్కినేనికి చెందిన అన్నపూర్ణ స్టూడియోని టార్గెట్ చేయడం ఏఎన్నార్ ని తీవ్రంగా బాధపెట్టింది. ఎన్టీఆర్ తో తనకున్న ఉన్న గొడవేంటి? దానికి ఏ పరిస్థితులు కారణమయ్యాయో? ఏఎన్నార్ ఓ సందర్భంలో వెల్లడించారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఆయన ఒంటరిగా రావాలనుకోలేదు. తనతో సమానమైన పాపులారిటీ ఉన్న ఏఎన్నార్ తో కలిసి రాజకీయ రంగప్రవేశం చేయాలి అనుకున్నారు. అది అధికారం చేజిక్కించుకునేందుకు సులభం అవుతుందని భావించారు. అదే విషయాన్ని ఏఎన్నార్ తో చెప్పారు. బ్రదర్ మనిద్దరం కలిసి పొలిటికల్ పార్టీ పెడదాం అన్నారు. ఏఎన్నార్ పాలిటిక్స్ నాకొద్దు. దాని వలన ఒక వర్గానికి వ్యతిరేకులం అవుతాము. విమర్శలు, ఆరోపణల ఎదుర్కోవాలి. రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదన్నారు.

annapurna studio
ముఖ్యంగా రాజకీయాలు నీకు సరిపడవు. లౌక్యం తక్కువ, కోపం ఎక్కువ. కాబట్టి నీలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో రాణించడం కష్టం అని ఏఎన్నార్ కుండబద్దలు కొట్టారు. దాంతో ఎన్టీఆర్ మొండిగా ఏఎన్నార్ సప్పోర్ట్ లేకుండానే పార్టీ స్థాపించడం. ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ మధ్యలో ఏఎన్నార్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై మాట్లాడుతూ కాషాయ వస్త్రం కట్టినంత మాత్రాన గొప్పవారైపోరు. ఈ వేషాలన్నీ కూటి కోసమే అన్న అర్థంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
కాషాయం బట్టలు, వేషాలు… అంటూ ఏఎన్నార్ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ గురించే అని కొందరు భావించారు. అదే విషయాన్ని ఎన్టీఆర్ తో చెప్పారు. అది మనసులో పెట్టుకున్న ఎన్టీఆర్.. ఏఎన్నార్ ని దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు.సీఎం హోదాలో ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ని టార్గెట్ చేశారు. ఏఎన్నార్ సంపాదించిన మొత్తం అన్నపూర్ణ స్టూడియోలో పెట్టారు. అనుమతులు రద్దు చేసి భూములు వెనక్కి తీసుకుంటే ఏఎన్నార్ నిండా మునిగిపోతారని అధికారులను పురమాయించారు.. ఎన్టీఆర్ తన కలల స్టూడియో జోలికి రావడం ఏఎన్నార్ ని బాగా కలచి వేసింది.
కోర్టు ద్వారా అన్నపూర్ణ స్టూడియో విషయంలో ఎన్టీఆర్ ని ఏఎన్నార్ ఎదుర్కొన్నారు. తర్వాత మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యాక కావలసిన అనుమతులు సంపాదించి స్టూడియోకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసుకున్నారు. రెండోసారి ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం వెళ్లి కలవాలనుకున్నారు. దానికి ఏఎన్నార్ ని కూడా రావాలని పిలిచారు. ఎన్టీఆర్ లక్షణాలు మంచివి కావు, నేను రాను అని ఏఎన్నార్ ఖరాకండీగా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక మరోసారి అన్నపూర్ణ స్టూడియో రెన్యువల్ కి సంబంధించిన పనులు చక్కబెట్టుకున్నాను అని ఏఎన్నార్ చెప్పుకొచ్చారు. తర్వాత గొడవలన్నీ పక్కన పెట్టి ఏఎన్నార్ సతీ సమేతంగా ఎన్టీఆర్ ఇంటికి భోజనానికి వెళ్లారట. జరిగినవేవీ మనసులో పెట్టుకో బ్రదర్ అని… ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఏఎన్నార్ తో అన్నారట. ఆ గొడవ ఇప్పటికీ వారి వారసులు కంటిన్యూ చేస్తున్నారు.
ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య బాబు పాత పగలన్నీ మనసులో పెట్టుకొని అక్కినేని తొక్కినేని అంటూ అవమానించారు. అలా మళ్లీ నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టారు. నాడు ఎన్టీఆర్, నేడు బాలయ్య బాబులు అదే ముక్కుసూటి మనస్తత్వంతో అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేశారని చెప్పొచ్చు.