
Taraka Ratna Wife Alekhya Reddy
Taraka Ratna Wife Alekhya Reddy: ‘మొదటి నుంచి మద్దతుగా ఉన్నవాళ్లు దూరమయ్యారు.. నేను నిస్సహాయంగా ఉండాల్సి వచ్చింది.. ’ అంటూ తారకరత్న సతీమణి అలేఖ్య తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడిదీ వైరల్ గా మారింది. తెలుగు సినీ నటుడు తారకరత్న మరణించి నెలరోజులు అవుతున్నా ఆయన సతీమణి అలేఖ్య ఇంకా దు:ఖంలోనే ఉన్నారు. ఇన్నాళ్లు తారక్ తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ రోజూ కన్నీరు పెడుతున్నారు. ప్రతీరోజూ తారక్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేటెస్టుగా ఆమె పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. తారక్ తో ఆమె చేసిన జీవిత ప్రయాణంలో ఎదురైన సమస్యలు, బాధల గురించి ఆమె రాసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రేమ పెళ్లి చేసుకున్న తారక్, అలేఖ్య దంపతుల వివాహాన్ని చాలా మంది కుటుంబ సభ్యులే వ్యతిరేకించారని కథనాలు వెలువడ్డాయి. కానీ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు మొదటి నుంచి తారక్ తో కలిసి ఉన్నారని తెలిసింది. తారక్ బాగోగులను బాలయ్య ఎప్పటికప్పుడు చూసుకునేవారు. ఆయనను సినిమాల్లోకి తీసుకురావడానికి బాబాయ్ పెద్ద చొరవ చూపారని తారక్ పలు సందర్భాల్లో చెప్పారు కూడా. ఇక తారక్ కు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు బాలయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆరోగ్యం బాగుకోసం ఎంతో కష్టపడ్డారు. తన సినిమా షూటింగ్ లను కూడా కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.
అయితే తారక్ మరణించిన తరువాత కూడా అలేఖ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తాజాగా అలేఖ్య పెట్టిన పోస్టుపై తీవ్ర చర్చ సాగుతోంది. మొదటి నుంచి మద్దతు ఇచ్చిన వాళ్లే దూరమయ్యారు… అంటూ ఆమె ఎవరికి ఉద్దేశించి పోస్టు పెట్టారోనని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె చెప్పే విషయాలన్నీ తారక్ ఉన్నప్పటివేనని కొందరు రిప్లై ఇస్తున్నారు. తారక్, అలేఖ్యలు పెళ్లి చేసుకున్న మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటిని గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టారని సమాధానం ఇస్తున్నారు. ఇంతకీ అలేఖ్య ఏ మేసెజ్ పెట్టారో చూద్దాం..

Taraka Ratna Wife Alekhya Reddy
‘తారక్.. నువ్వు మమ్మల్ని విడిచి నెలరోజులు అయింది. నీ మెమోరీస్ ఇంకా కళ్లముందు మెదలాడుతూనే ఉన్నాయి. మనం కలిసి జీవిస్తామా? అని అనుకున్న నాకు నువ్వే ధైర్యం చెప్పావు. నీవిచ్చిన ధైర్యంతోనే కొత్త జీవితాన్ని ప్రారంభించాం. అయితే మొదట్లో ఎంతో వివక్షను ఎదుర్కొన్నాం.. జీవితం ముందుకు సాగడానికి ఎంతో పోరాటం చేశాం.. నిష్కమ్మ జన్మించిన తరువాత మన జీవితమే మారిపోయింది. సంతోషం రెట్టింపు అయింది. కానీ బాధలు అలాగే మిగిలాయి. ఈ సమయంలో మనపై విషాన్ని చిమ్ముతున్నా కళ్లకు గంతలుకట్టుకొని బతికాం.. మనకు పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావ్. కానీ మన బాధను అర్థం చేసుకునే వాళ్లు లేరు..’అంటూ పోస్టు పెట్టారు.