
Tarakaratna Wife Alekhya Reddy
Tarakaratna Wife Alekhya Reddy: నందమూరి తారకరత్న చనిపోయిన ఘటన టాలీవుడ్ మొత్తాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే.ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మనకెవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.అవన్నీ చూసిన తర్వాత తారకరత్న పాపం ఇన్ని కష్టాలను అనుభవించాడా అని మనం బాధ పడుతాము.తన తండ్రి మోహన్ కృష్ణ దగ్గర వేల కోట్ల రూపాయిలు ఆస్తులు ఉన్నప్పటికీ ఏనాడు కూడా చిల్ల గవ్వ కూడా ఇవ్వలేదు.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని కట్టుబట్టలతో తారకరత్న ని బయటకి గెంటేసిన వ్యక్తి మోహన్ కృష్ణ.కనీసం చెల్లెలు పెళ్లి కూడా చూసేందుకు అనుమతిని ఇవ్వలేదట.ఇంటి నుండి బయటకి వచ్చిన తర్వాత తారకరత్న చేతిలో రూపాయి కూడా లేదు.కష్టాల్లో ఉన్నాను కదా అని ఒకరిని చెయ్యి చాచి సహాయం అడిగే మనిషి కాదు తారకరత్న.ప్రతీ పైసా తన కష్టం తోనే సంపాదించుకొని పెళ్ళాం పిల్లలను పోషించాడు.
ఆయన చనిపోయిన తర్వాత భార్య అలేఖ్య రెడ్డి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తారకరత్న మీద తనకి ఉన్న ప్రేమని, అతనితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వస్తుంది.రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్టు ఒకటి చూస్తే పాపం తారకరత్న జీవితం లో ఇన్ని కష్టాలను ఎదురుకున్నాడా అని అనిపిస్తుంది.

Tarakaratna Wife Alekhya Reddy
ఆమె మాట్లాడుతూ ‘జీవితం లో మన ఇద్దరం కలిసి ఎన్నో అవమానాలను ఎదురుకున్నాం.ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసాం..ఇల్లు లేక కార్లలో నిద్రించిన రోజుల నుండి , నీ చివరి రోజు వరకు ఎన్నో సవాళ్ళను ఎదురుకున్నాం.మన జీవితం అంత సాఫీగా ఏమి సాగలేదు.నువ్వు ఒక యోధుడివి నాన్న,నువ్వు చూపినంత ప్రేమ మా మీద ఎవ్వరు చూపలేరు’ అంటూ ఎంతో ఎమోషనల్ గా అలేఖ్య రెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.