Tadap: తెలుగులో గత మూడు ఏళ్లలో వచ్చిన హిట్ చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించిన చిన్న సినిమాగా ‘ఆర్‌ఎక్స్ 100’కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ మధ్య లవ్ ట్రాక్, అలాగే పాయల్ క్యారెక్టర్ జనానికి బాగా నచ్చాయి. దాంతో సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సినిమా కారణంగా టీమ్ అందరి కెరీర్లు బాగు పడ్డాయి.
కేవలం ‘ఆర్ఎక్స్ 100’ అనే ఒకే ఒక్క సినిమాను పెట్టుకుని హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి కూడా విషయం లేకపోయినా ఓ రేంజ్ లో బిల్డప్ ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం ‘ఆర్ఎక్స్ 100’ చిత్రమే. ఇప్పుడు ఆ సినిమా హిందీలో ‘తడప్’ పేరుతో రీమేక్ అవుతుంది.
కాగా డిసెంబర్ 3న ఈ హిందీ రీమేక్ చిత్రం విడుదల కానుంది. అయితే, నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ హిందీ మూవీ ట్రైలర్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడం వల్లనో.. లేక, ట్రైలర్ జనానికి బాగా నచ్చడం కారణంగానో తెలియదు గానీ, ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
అన్నిటికీ మించి ఈ సినిమా పై ట్రైలర్ భారీ అంచనాలను రెట్టింపు చేసింది. మరోపక్క ఈ ‘తడప్’ లో మాజీ హీరో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక పాయల్ రాజపుత్ పాత్రలో తార సుతారియా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఆర్ఎక్స్ 100 సినిమాకు, ఈ తడప్ చిత్రానికి ఎక్కడా పొంతన లేదు.
భారీ విజువల్స్ తో అంతే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో పాత్రలో భావోద్వేగాలను కూడా బలంగా చూపించారు. నిజానికి హిందీలో ఈ సినిమాకు క్రేజ్ రావడానికి మరో కారణం కూడా ఉంది. ‘డర్టీ పిక్చర్’, ‘ఒన్స్ అపాన్ టైం ఇన్ ముంబై’ వంటి బోల్డ్ భారీ హిట్ చిత్రాలు తీసిన మిలన్ లూథ్రియా ఈ సినిమాకి దర్శకుడు.
Also Read: Samantha: ప్చ్.. ఒక్కోటి తీసేసుకుంటూ పోతున్న సమంత !
అందుకే, ఈ సినిమా పై మొదటి నుంచీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ చూసిన మేకర్స్, ‘డర్టీ పిక్చర్’ డైరెక్టర్ భారీగా కుమ్మసాడు అంటున్నారట. సినిమా చాలా బాగా వచ్చిందట.
Also Read: Payal Rajput: మళ్ళీ అందాల ప్రదర్శనే నమ్ముకున్న పాయల్ !