TANA Srinivas kalyanam : తానాలో ‘శ్రీనివాస కళ్యాణం’
2023 జూలై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో తానా సమావేశం జరుగబోతోంది.. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మరియు కో-ఆర్డినేటర్ రవి పొట్లూరి ప్రతి ఒక్కరినీ తానా నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు

TANA Srinivas kalyanam : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
ఈ మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. జూలై 9వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు.
తిరుమల నుంచి వచ్చే పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో జరిగే ఈ శ్రీనివాస కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.
2023 జూలై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో తానా సమావేశం జరుగబోతోంది.. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మరియు కో-ఆర్డినేటర్ రవి పొట్లూరి ప్రతి ఒక్కరినీ తానా నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్, కెఎస్ చిత్ర, డాక్టర్ కమలేష్ పటేల్, చంద్రబోస్, కనకమేడల రవీంద్ర వంటి ప్రముఖులు పాల్గొననున్నారు.
నందమూరి బాలకృష్ణ, ఇళయరాజా, మురళీమోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
తానా సదస్సు చివరి రోజైన జూలై 9న శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. TTD శ్రీనివాస కళ్యాణం మహోత్సవం కార్యక్రమం జూలై 09, 2023న తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చే అర్చకుల సమక్షంలో జరగనుంది. శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో పాల్గొనాలనుకునే వారు ఇక్కడ ఉన్న లింక్‌ను క్లిక్ చేసి నమోదు చేసుకోవాలి. https://tanaconference.org/tana-ttd-srinivasa-kalyanam-details.html
