TANA Awards : వివిధ రంగాల నిపుణులకు ‘తానా’ అవార్డులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఈ కమిటి వారు విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని “తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్” ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు.

  • Written By: Naresh
  • Published On:
TANA Awards : వివిధ రంగాల నిపుణులకు ‘తానా’ అవార్డులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

TANA Awards : ఉత్తర అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలై 7,8,9వ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని, ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్యహించి అవార్డులతో ఘనంగా సత్కరించే మహోన్నత కార్యక్రమానికి మహాసభల తానా అవార్డ్స్ కమిటి శ్రీకారం చుట్టింది.

ఈ కమిటి వారు విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని “తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్” ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు.

మీకు అర్హులు అనిపించే వారి పేర్లను ప్రతిపాదించి వారికి తగిన గౌరవసత్కారాలు దక్కేలాగా సిఫార్సు చేయడానికి వారి పూర్తి వివరాలు ఆంగ్లంలో లేక తెలుగులో కానీ క్షుణంగా వ్రాసి, ఫోటో జతపరిచి awards@tanaconference.org కు ఇమెయిల్ పంపమని ప్రార్ధన. మీరు ప్రతిపాదించడానికి చివరి గడువు జూన్ 10వ తారీకు అని గమనించాలి.

సంబంధిత వార్తలు