Balakrishna: బాలయ్య వెంట పడుతున్న స్టార్ డైరెక్టర్లు…కథ చెప్పి ఒప్పించిన తమిళ్ స్టార్ డైరెక్టర్…

వరుసగా మూడు హిట్లు కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

  • Written By: Gopi
  • Published On:
Balakrishna: బాలయ్య వెంట పడుతున్న స్టార్ డైరెక్టర్లు…కథ చెప్పి ఒప్పించిన తమిళ్ స్టార్ డైరెక్టర్…

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.ఎందుకంటే నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరును సంపాదించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు వరుసగా తన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి తనదైన రీతిలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా తన స్టామినా ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చూపించాడు.

ఇక ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా మూడు హిట్లు కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు బాలయ్య బాబు బాబి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్ళింది.ఇక ఈ సినిమా మీద బాలయ్య బాబు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి ఎందుకంటే బాబీ ఇంతకుముందు చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి అదిరిపోయే హిట్టు కొట్టాడు కాబట్టి బాలయ్య బాబుకు కూడా అదే తరహా హిట్టు ఇస్తాడని అందరూ భావిస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక తమిళ్ డైరెక్టర్ బాలయ్య బాబు కి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అని అంటే తెలుగులో రామ్ లాంటి హీరోతో వారియర్ అనే సినిమా చేసి యావరేజ్ హిట్ అందుకున్న లింగు స్వామి…ఈయన చాలా రోజుల నుంచి బాలయ్య బాబుతో సినిమా చేయాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే ఈ కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాలయ్య బాబు వరుస సినిమాలను కమిట్ అవుతూ ఉండటంవల్ల ఆయన చాలా బిజీగా ఉన్నాడు.అయిన కూడా లింగస్వామి చెప్పే కథను విని అది నచ్చింది అని చెప్పి మనం సినిమా చేద్దామని లింగస్వామి తో చెప్పినట్టుగా తెలుస్తుంది.

అయితే లింగస్వామి తాజాగా రామ్ తో చేసిన వారియర్ సినిమా అంత పెద్దగా ఆకట్టుకొనప్పటికి లింగు స్వామికి బాలయ్య బాబు సినిమా ఇవ్వడం పట్ల బాలయ్య బాబు అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బాలయ్య బాబు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు ఎందుకంటే అటు ఎలక్షన్స్ వస్తున్నాయి. అలాగే ఒక వైపు అన్ స్టాపబుల్ షో చేస్తున్నాడు. ఇంకో పక్క బాబీ తో సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ మూడు అయిపోయిన తర్వాత బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. ఇవన్నీ పూర్తి అయ్యాక లింగుస్వామి డైరెక్షన్ లో చేసే అవకాశం అయితే ఉంది.ఇక అప్పటివరకు లింగుస్వామి బాలయ్య బాబు కోసం వెయిట్ చేస్తాడా లేదా మరో హీరోతో సినిమా మొదలు పెట్టేస్తాడు అనేది తెలియాల్సి ఉంది….

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు