బోల్డ్ సాంగ్ షూట్ లో తమన్నా !
మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కోసం, ప్రస్తుతం నితిన్ చేస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో ఓ బోల్డ్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తమన్నాది హీరోయిన్ పాత్ర కాదు కాబట్టి, ఆమెకి సాంగ్స్ లేవు. మరి స్టార్ హీరోయిన్ అయిన తమన్నాకి సాంగ్స్ లేకపోతే ఎలా ? ఆమె అభిమానులు నిరుత్సాహ పడతారేమో కదా. అందుకే కథకు కథనంకు సంబంధం లేకపోయినా, తమన్నా పై ఒక ఐటమ్ లాంటి ప్రమోషనల్ పాటను […]

మిల్కీ బ్యూటీ తమన్నా ఎక్కువ రెమ్యునరేషన్ కోసం, ప్రస్తుతం నితిన్ చేస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో ఓ బోల్డ్ పాత్రలో నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తమన్నాది హీరోయిన్ పాత్ర కాదు కాబట్టి, ఆమెకి సాంగ్స్ లేవు. మరి స్టార్ హీరోయిన్ అయిన తమన్నాకి సాంగ్స్ లేకపోతే ఎలా ? ఆమె అభిమానులు నిరుత్సాహ పడతారేమో కదా.
అందుకే కథకు కథనంకు సంబంధం లేకపోయినా, తమన్నా పై ఒక ఐటమ్ లాంటి ప్రమోషనల్ పాటను చిత్రీకరించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సాంగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున ఒక సెట్ వేశారు. కాగా ఈ సెట్ లోనే తమన్నా – నితిన్ ఈ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ ప్రమోషనల్ సాంగ్ లో నితిన్ – తమన్నా లిప్ కిస్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.
అంటే, ఈ సాంగ్ లోనే సినిమాలో తమన్నా పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నారు. మొత్తానికి తమన్నా భారీ రెమ్యునరేషన్ కోసం ఎలాంటి క్యారెక్టర్లు చేయడానికైనా సిద్ధం అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. ఎలాగూ ఇక కెరీర్ కూడా ఎండింగ్ కి వచ్చేసింది. ఇలాంటి సమయంలో కూడా పద్దతి పాడు అంటూ కూర్చుంటే.. డబ్బులు రావు అని, అందుకే చివరి దశలో ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి అడ్డు అదుపు పెట్టుకోలేదని తమన్నా చెబుతుందట.
ప్రస్తుతానికి అయితే ఈ ముదురు మిల్కీ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ ఆమె చేతిలో ఇంకా ఎఫ్ 3 మరియు సిటీ మార్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా మళ్ళీ మరో రెండు సినిమాలను పట్టుకుంటుంది తమన్నా. మొదటి నుండి తమన్నా తన కెరీర్ ను ఇలాగే బిల్డ్ చేసుకుంటూ ముందుకు పోతుంది. అలాగే ‘గుర్తుందా శీతాకాలం’ అనే చిన్న సినిమాలోనూ తమన్నా తన తళుకులు చూపించనుంది.
