Mahesh babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనదైన స్టైల్లో సినిమాలు చేయడంలో మహేష్ బాబుకి సాటిరారు. ఎక్కువగా వార్తల్లో కనిపించటానికి ఇష్టపడరు ఈ సూపర్ స్టార్. తెలుగులో ఈయనకు ఉన్నంత అడ్వటైజ్మెంట్ క్రేజ్ మరి ఏ స్టార్ హీరోకి లేదనే చెప్పాలి.సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెకుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’.ఈ చిత్రాన్ని మహేష్ సొంత నిర్మాణ సంస్థతో కలిసి 14 రీల్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ స్వరాలను అందిస్తున్నారు.
ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట టీజర్‌లో మహేశ్ తన లుక్ ని పూర్తిగా స్టైలిష్‌గా మార్చేశారు.ఈ సినిమా కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. ప్రిన్స్ ను ఎలివేట్ చేసే ఫస్ట్ సాంగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉండబోతోందని తాజాగా థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ వింటే అర్థమవుతోంది.ప్రస్తుతం థమన్ షేర్ చేసిన ఈ ట్యూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సుబ్బరాజు వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రబృందం స్పేయిన్‌లో కీలక సన్నివేశాలను, సాంగ్‌ను చిత్రీకరణ జరుపుతోంది. దీపావళి పండుగ సందర్భంగా కొత్త అప్డేట్ రానున్నది సమాచారం..