గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భవాని మాల ధారణలు పెరిగాయి. లక్షలాదిమంది భక్తులు భవాని మాలను ధరించి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇరుముడులతో వస్తారు. ఎక్కువమంది వందలాది కిలోమీటర్లు కాలినడకన వస్తుంటారు.
వివాహ ప్రాంగణం భారీ జన సందోహంతో కిక్కిరిసింది.అన్ని రాజకీయ పక్షాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్లు ఖర్చు చేసామని.. పలు దేవాలయాల నుంచీ సిబ్బంది ని తీసుకొచ్చి దసరా కు వినియోగిస్తామని కర్నాటి రాంబాబు తెలిపారు.
డెలాయిట్, నాస్కామ్ నివేదిక ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టెక్ హబ్ లు ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కొత్త కార్యాలయాలు, ఫర్నీచర్ ఏర్పాటు చేసుకోవాలంటే 50 శాతం పెట్టుబడి పోతుంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి పట్టు దొరకని ప్రాంతంగా విజయవాడ ఉంది. గత రెండు ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని టిడిపి గెలుపొందింది . ఈసారి దానిని ఎలాగైనా బ్రేక్ చేయాలన్నా కసితో వైసిపి పని చేస్తోంది. నగరంలోని మూడు నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది.
అయితే వాళ్ళ హంగామా హద్దులు దాటి విజయవాడలోని కపార్డీ అనే థియేటర్ లో వెండితెర ని చించేసి స్థాయికి చేరింది. ఎదో చిన్నగా చిరిగిపోయిన పర్వాలేదు, తక్కువ డ్యామేజీ తోనే రికవర్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్క్రీన్ ని 90 శాతం చించేశారు. స్క్రీన్ చిరిగిపోయిన కూడా, ఆ చిరిగిన స్క్రీన్ తోనే ఆట ని ప్రదర్శించారు.
తమ కష్టాలు, బాధలు తీర్చమని అడిగేందుకు ఎంతో భక్తితో ప్రజలు దేవాలయానికి వస్తారు. నిత్యం రోజూవారి కార్యక్రమాలతో బిజీగా ఉండే వీరు ఆలయానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇక్కడ ప్రతీ చోట పైసల్ వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలోకి వచ్చే భక్తలు అమ్మవారిని దర్శనం చేసుకున్న తరువాత టెంకాయను పగలగొడుతారు. అయితే భక్తులను ఆ టెంకాయను కొట్టనీయకుండా అక్కడున్న సిబ్బంది లాక్కుంటారు. వారే దానిని కొట్టి.. ఆ తరువాత రూ.20 వసూలు చేస్తున్నారు.
అయితే తన భార్య కాపురానికి రాకపోవడానికి, విడాకులకు అత్తమామలే కారణమని రాజేష్ భావించాడు. ఎలాగైనా వారిద్దర్నీ మట్టుబెట్టేందుకు డిసైడయ్యాడు. హత్యకు వ్యూహరచన చేశాడు. కానీ అత్తను మాత్రమే హతమార్చగలిగాడు.
మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు.
అయితే దీనిపై అవినాష్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తామూ ఎన్టీఆర్ అభిమానులమే అన్నారు. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసా అని ప్రశ్నించారు.