'మిస్టర్' అనే సినిమా తో వీళ్లిద్దరు మొట్టమొదటిసారి కలుసుకున్నారు, ఆ సినిమా ఫ్లాప్ అయితే అయ్యింది కానీ,వీళ్ళ మధ్య మంచి స్నేహాన్ని ఏర్పాటు చేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది.
లావణ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఆమెకు విజయం దక్కి చాలా కాలం అవుతుంది. ఇటీవల లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. మంచి ఆరంభం లభించినా లావణ్య నిలదొక్కుకోలేకపోయింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట ఒక్కటవబోతుంది.. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారని.. జూన్ 9న నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కలిసి 2017లో ‘మిస్టర్’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు.
కానీ ఎప్పుడైతే లావణ్య త్రిపాఠి వాటిల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిందో, అప్పటి నుండి వీళ్ళ మధ్య ఏమి లేదని నమ్మే వాళ్ళు ఉన్నారు,నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు.
దీనిపై లావణ్య త్రిపాఠి పలుమార్లు స్పందించి మా మధ్య అలాంటిదేమి లేదని చెప్పినప్పటికీ ఈ రూమర్స్ ఆగడం లేదు. అయితే ఈమె గురించి లేటెస్ట్ గా మరో పుకారు షికారు చేస్తుంది. అదేమిటంటే ఈమె వరుణ్ తేజ్ కంటే ముందే అందాల రాక్షసి చిత్ర హీరో నవీన్ చంద్ర తో కొంతకాలం ప్రేమాయణం నడిపిండట.
నాగబాబు కూడా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నప్పుడు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు అని విన్నాము నిజమేనా అని అడిగిన ప్రశ్నకి నాగ బాబు 'నో' అని సమాధానం చెప్పలేకపోయాడు.'సమయం వచ్చినప్పుడు వరుణ్ బాబు స్వయంగా ప్రకటిస్తాడు' అని చెప్పాడు.ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది, జూన్ నెలలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.