తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత ప్రారంభమైన వారాహి యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల శ్రేణులు యాత్రకు పోటెత్తారు. అయితే సినిమా షూటింగ్ లు ఒకవైపు పెండింగ్లో ఉండడం, ఇంట్లో శుభకార్యం ఉండడంతో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ నిచ్చారు.
స్కిల్స్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళనున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం నాయకత్వానికి అపార అనుభవం ఉందని.. దానికి జనసేన పోరాట పటిమ తోడైతే అద్భుత విజయం సాధించవచ్చని పవన్ అభిప్రాయపడుతున్నారు. నిన్నటి వరకు టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి మూడో విడత యాత్ర సాగుతోంది. ప్రస్తుతం మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడనలు యాత్ర కొనసాగుతోంది.
వారాహి మూడో విడత యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. పవన్ సరికొత్త విమర్శనాస్త్రాలకు వైసీపీ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. జగన్ గద్దె దించడానికి, జనసేన- టిడిపి కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలీసులు కేసుల నమోదు ప్రక్రియను సైతం నిబంధనల మేరకు జరపడం లేదు. అప్పుడెప్పుడో ఆగస్టు 30న మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ వారాహి మూడో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. యాత్రలో పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు సైతం పాల్గొంటున్నాయి.
2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని పవన్ గట్టిగానే నమ్ముతున్నారు. అందుకే కూటమికి ఏకపక్ష విజయం దక్కుతుందని భావిస్తున్నారు.
పవన్ విధానపరమైన అంశాలపై మాట్లాడినా.. వైసీపీ నేతలు మాత్రం పవన్ పై వ్యక్తిగత దాడికి దిగేవారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు స్థాయికి మించి మాట్లాడేవారు.
ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను ప్రభావితం చేసే నాయకుల్లో పవన్ ముందుంటారు. ఆయన ఏం మాట్లాడినా? ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజల్లోకి బలంగా చొచ్చుకొనివెళ్తాయి. అందుకే ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రపై హై టెన్షన్ నెలకొంది.