ప్రపంచలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థంగా భారత్ మారబోతోందని గుర్తుచేశారు. 9/11, 26/11 దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, దాని పర్యవసానాలు గురించి వివరించారు. ప్రధాని ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్రమోడీకి జిగ్రీ దోస్త్ డోనాల్డ్ ట్రంప్. ఆయన మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవాలని ఏకంగా మోడీ అమెరికా వెళ్లి మరీ ‘హౌడీ మోడీ’ సభలో ప్రచారం చేశాడు. కానీ బ్యాడ్ లక్.. ట్రంప్ ఓడిపోయాడు. ఆయన ప్రత్యర్థి జోబిడెన్ గెలిచాడు. అమెరికా అధ్యక్షుడయ్యాడు. తన పగవాడికి ప్రాధాన్యమిచ్చి గెలుపునకు ప్రచారం చేసిన నరేంద్రమోడీ అమెరికాకు వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు జోబిడెన్.. మోడీని సరిగ్గా మర్యాద ఇచ్చాడా? పట్టించుకున్నాడా? ప్రాధాన్యత కల్పించాడా? అన్నది […]