అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి. ఇంతవరకు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు అనే విషయాన్ని ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చలేకపోతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో అంతు పట్టకుండా ఉంది. ఇక దీనిని మర్చిపోకముందే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టిన పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా లోప భూయిష్టంగానే ఉందని తెలుస్తోంది.
ప్రశ్న పత్రాలు రూపొందించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి. మెజారిటీ విద్యార్థులు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉండాలి. కనీసం సగం ప్రశ్నలు పాఠ్యపుస్తకాలు నుంచి ప్రిపరేషన్ నుంచి గుర్తించేదిగా ఉండాలి.
ఏఈ రమేష్ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో కాపీయింగ్ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు.. వారినుంచి స్వాధీనం చేసుకున్న ఎలకా్ట్రనిక్ వస్తువుల నుంచి సాంకేతిక ఆధారాలను సేకరించి చార్జిషీట్లో పొందుపర్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రశ్నపత్రాల లీకేజీకే పరిమితమైందనుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. అధునాతన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ సాయంతో మాస్ కాపీయింగ్ జరిగినట్లు సిట్ అధికారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏఈఈ పరీక్ష రాసిన ముగ్గురు అభ్యర్థులు టెక్నాలజీ సాయంతో కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఇలాంటి వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం నియమించిన సిట్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి టీఎస్ పీఎస్సీ ఎందుకు వెనకంజ వేస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అనలటిక్ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అత్యంత కఠిన ప్రశ్నపత్రాన్ని రూపొందించిన టీఎస్ పీఎస్సీ ఖ్యాతి ఓ దశలో యూపీఎస్సీని మించిపోగా..
TSPSC: “మా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రాల అన్నింటికంటే గొప్పది. మిగతా ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగ అర్హత పరీక్షలు ఎలా నిర్వహించాలో మా దగ్గర చూసి, వారి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు కాబట్టే ఇంతటి ఘనత సాధ్యమైంది” ఇవీ […]
TSPSC paper leakage : టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. నిందితులు కంప్యూటర్లో ఉన్న ప్రశ్నపత్రాన్ని తస్కరించారని నిరూపితమైనా.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) మొదట్లో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి సమాచార సాంకేతి(ఐటీ) చట్టా న్ని ప్రయోగిస్తూ.. ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేసింది. ఇదొక్కటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు సంబంధించిన సింహభాగం కేసులను ఐపీసీ కిందే నమోదు చేస్తున్నారు. ఫలితంగా.. […]
TSPSC: జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోవాల్సిన పరువు పోయింది. 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలు నిలువునా కూలిపోయాయి. ఏళ్లకు ఏళ్ళు ప్రిపేర్ అయిన వారి కలలు కళ్ళలు అయిపోయాయి. ఇంక జరిగిన తర్వాత ఎప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేల్కొన్నది. ఏఈ ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత, పరీక్షలన్నీ రద్దయిన తర్వాత.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ ఫోన్లు, […]
TSPSC Paper Leakage : గ్రూప్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసిన సమయంలో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇంటర్వ్యూల ద్వారా తమకు కావాల్సిన వారికి ఎక్కువ మార్కులను వేస్తారనే అపవాదు చాలా కాలం నుంచి ఉంది. దాంతో ఈ ఇంటర్వ్యూ పద్ధతి పట్ల పలువురు అభ్యర్థులు వ్యతిరేక భావంతో ఉన్నారు. దీనిని అంచనా వేసిన ప్రభుత్వం అన్ని రకాల పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. నేరుగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల […]
TSPSC Paper Leakage : మొన్న ఏపీలో గ్రూప్-1 ప్రిలీమినరీ పరీక్ష జరిగింది. ఇది నిర్వహించింది ఏపీఎస్సీసీ కాదు. టాటా గ్రూప్. అదేంటి టాటా గ్రూప్ గ్రూప్-1 పరీక్ష నిర్వహించడమేంటి అనుకుంటున్నారా? ఎస్.. మీ సందేహం కరక్టే. కానీ ఏపీ ప్రభుత్వం మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఉద్యోగ నియామక పరీక్షల్లో మాత్రం కచ్చితత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఏపీఎస్సీసీ పర్యవేక్షణకు మాత్రమే ఉంచి, మిగతా వ్యవహారాన్ని టాటా అయాన్ అప్పగించింది. దీంతో అక్కడ పరీక్ష సజావుగా జరిగింది. ఎన్ని […]