సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది.
దీంతో మనకు సులభమైన పద్ధతిగానే ఉంటుంది. రిజర్వేషన్ చేసుకున్న తరువాత 30 రోజుల నుంచి ఆరు నెలల సమయంలో మనం దీన్ని వాడుకోవాలి.
Train: రైలు ప్రయాణం ఎంత సుఖమో.. కొన్నిసార్లు అంతే ప్రమాదకరం. సాధారణంగా మన రైళ్లు సమయానికి రావు. ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం మనం ఇంకాస్త లేట్ గా వెళ్తాం. రైలు ఆలస్యం అయితే వెయిట్ చేయొచ్చు.. కానీ ముందే వెళ్లిపోతే దాని ప్రభావం సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఎక్కాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఆయన ఇల్లు చేరడానికి 22 ఏళ్లు పట్టింది. ఉపాధి కోసమని.. ఉపాధి కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ […]
దేశ ప్రథమపౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రైలు ప్రయాణం చేశారు. దిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని ఆయన స్వస్థలం కాన్పూర్ కు శుక్రవారం ఆయన రైలులో బయల్దేరారు. దిల్లీలోని సఫ్దార్జంగ్ రైల్వేస్టేషన్ లో రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక రైలు ఎక్కారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో సునీత్ శర్మ స్వయంగా వచ్చి వారికి వీడ్కోలు పలికారు.
దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు భాన్సీ బచేలి మార్గంలో విశాఖ వెళ్తున్న రైలును మావోయిస్టులు నిలిపివేశారు. రైలు నుంచి ప్రయాణికులను దింపి పట్టాలను మావోయిస్టులు తొలగించారు. ఆనంతరం ఇంజిన్, రెండు బోగీలను మావోలు పడేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 26 న మావోయిస్టులు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
భారత్ నేపాల్ మధ్య ఇక రైలు ప్రయాణం సాగించవచ్చని భారత రైల్వే అధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ప్యాసింజర్లను డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ మేరకు డీజిల్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైళ్లను అందజేసింది. బీహార్లోని జయనగర్, నేపాల్లోని ధనుసా జిల్లాల మధ్య ఈ రైళ్లు ప్రయాణం చేయనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగనున్నాయి.
ఒక వంక దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా పరిష్టితులు అదుపు తప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భరోసా వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఆలోచన లేదని కేంద్ర ప్రస్తుతం స్పష్టం చేయడంతో తిరిగి జన జీవనం త్వరలో సాధారణ స్థితికి చేరుకోవచ్చనే భరోసా ఏర్పడుతున్నది. అందుకు స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈనెల 15 నుంచి రైల్వే, విమాన బుకింగ్లు తిరిగి ప్రారంభం కావచ్చనే […]