మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళ్లాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సమాచార శాఖకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఇందులో జూన్ 2న ఒక్కరోజే రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో న్యూట్రీషియన్ కిట్లు పంపిణీ.
దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో రైతు వేదికల వద్ద సమావేశాల నిర్వహణకు.. ఒక్కొక్క వేదిక వద్ద సౌండ్ సిస్టం, టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం ఇతర ఏర్పాట్లు, వెయ్యి మందికి మాంసాహారం తో కూడిన భోజనాలు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రకారం ప్రతి మండలంలో నాలుగైదు రైతు వేదికలు ఉంటే..
తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతే వేగంగా అప్పుల కూపంలోకి కూరుకుపోతోంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ సంక్షే మపథకాల పేరిట ప్రజలకు నేరుగా డబ్బులు పంచుతుండడంతో రాష్ట్ర ఆర్థి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎనిమిదేళ్లలో తెలంగాణ బంగారు మయం అయిందో లేదో తెలియదు కాని ప్రతీ తెలంగాణ ఒక్కరిపై తెలియకుండానే రూ.2 లక్షల అప్పులు మాత్రం ఉంది. ఈ ఏడాది నుంచి పరిస్థితి మరీ దిగజారుతోంది. అప్పులు చేయనిదే నెల గడిచే పరిస్థితి ఉండడం లేదు.
ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్ 2 , 2014న అధికారికంగా తెలంగాణ ఆవిర్భవించింది. 60 ఏళ్ల కల సాకారమైన రోజు. కరోనా లాక్ డౌన్ లేకుంటే తెలంగాణలో సంబరాలు అంబరాన్ని అంటేవి. కానీ ఈ ఆంక్షల నడుమ సాదాసీదాగానే ఈసారి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం […]
ఎందరో ప్రాణత్యాగాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. జూన్2, 2014లో రాష్ర్ట ఆవిర్భావం జరిగింది. 29వ రాష్ర్టంగా తెలంగాణ కల సాకారమైంది. 58 ఏళ్ల పాటు వివక్షకు గురైన ప్రజలు రాష్ర్ట సాధనకు ఎంతో శ్రమించారు. అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటం వెరసి రాష్ర్ట ఏర్పాటు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ర్టం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. గత ఆరేళ్లుగా ప్రజల ఆకాంక్షల కసం పన చేస్తున్నారు. దేశానికే తలమానికంగా నిలుస్తోంది. అభివృద్ధి పథంలో […]
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం మారిందని తమిళ్ సై అన్నారు. ప్రజల సంతోషం, సంతృప్తియే ప్రభుత్వ పనితనానికి కొలమానమన్నారు. ప్రజల […]
నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఏడోపడిలోకి తెలంగాణ రాష్ట్రం అడుగుపెడుతోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాకపోవడంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడబరంగా జరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుండగా మరోవైపు సింగరేణిలో విషాదం నెలకొనడం శోచనీయంగా మారింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో సోమవారం ప్రమాదవశాత్తు బ్లాస్టింగ్ జరగడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సింగరేణికి చెందిన ఓపెన్ కాస్ట్-1లో సోమవారం కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. […]
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్న పురస్కరించుకొని అమరవీరులకు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. కేసీఆర్ కారులో బయలుదేరుతున్న క్రమంలో ఓ యువకుడు కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి గన్ పార్కుకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల మౌనం […]
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయని, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను […]