Chandrababu Naidu Manifesto : మహానాడులో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అవన్నీ అమలు చేయాలంటే జగన్ చేస్తున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతున్నాయి. అయితే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే జగన్ హామీలు, కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు, బీహార్ లో ఎన్నికల హామీలను కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మేనిఫెస్టోగా రూపొందించారు. జగన్ కు ధీటుగా తన అమ్ముల పొది నుంచి మినీ మేనిఫెస్టో ఒకటి బయటకు తీశారు. ఓట్లు రాబెట్టే తారకమంత్రంగా […]
ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడుకు నందమూరి వారసులు ఎక్కువగానే వచ్చేవారు. తొలిసారి బాలకృష్ణ మినహా మరో నందమూరి వారసుడు ఇక్కడ కనిపించ లేదు.
గత కొంతకాలంగా రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటూ వస్తున్న సినీ నటుడు, టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ నేడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం త్వరలో పతనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న టిడిపి మహానాడులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండదని, త్వరలోనే టిడిపి అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పడక వేసిన్నట్లు ధ్వజమెత్తుతూ […]
మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వెబినార్ ద్వారా ప్రసంగించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశామని ఆయన చెప్పారు. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం అని ఆయన చెప్పారు. అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించామని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఊబకాయంతో బాధపడుతున్నందున ఆయనకు ఉపవాస దీక్షలు అవసరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిన్న దీక్ష కారణంగా ఒక అరా కేజీ బరువు తగ్గి ఉంటారని నువ్వులు పూయించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిరర్దక ఆస్దులు విక్రయించాలని టిడిపి ప్రభుత్వం హయాంలో సబ్ కమిటి వేశారని, ఆ సబ్ కమిటిలో భానుప్రకాష్ రెడ్డి, డిపి అనంత, సుచిత్రా ఎల్లా, సండ్ర వెంకట వీరయ్య(టిడిపి ఎంఎల్ఏ)లు ఉన్నారని […]
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమం అంటే వేలాదిగా నాయకులు, భారీ బహిరంగసభ, వందల కొద్దీ వంటకాల మెనుతో వేల మందికి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల రాజకీయ చర్చలు, తీర్మానాలతో మూడు రోజుల పాటు ఆర్భాటంగా నిర్వహించుకునే కార్యక్రమం. ఈ ఏడాది ఏ హడావిడి లేకుండా జరగనుంది. ఇందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పట్లో భారీ సభలు, సమావేశాలకు అవకాశం కనిపించడం […]