పెద్దమనుషుల అంగీకారం ప్రకారం ఫౌండేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులు మూడు గ్రూపులకు చెందిన ఒక్కొక్కరికి పంపకం చేయవల్సి ఉండగా, డెట్రాయిట్-న్యూయార్క్‌కు చెందిన గ్రూపుకు మిగతా రెండు గ్రూపులు మొండిచేయి చూపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో ముఖ్య విభాగమైన ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటర్‌గా ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీకి, తెలుగు సంఘాలకు తానా కార్యక్రమాలు తెలుసుకునేలా చేయడంతోపాటు, వారిని కూడా ఇందులో భాగస్వాములయ్యేలా కృషి చేయనున్నట్లు ఠాగూర్ మల్లినేని చెప్పారు.
ఉత్తర అమెరికా తెలుగుసంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2023- 25 సంవత్సరానికిగాను తానా అధ్యక్షునిగా ఆయన వ్యవహరిస్తారు. తన రెండేళ్ళ పదవీకాలంలో తానా టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతపరుస్తానని తెలిపారు
తానా సభల చివరి రోజునే అధ్యక్షులు అంజయ్య చౌదరి పదవీ కాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో నూతన తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ వేదికపైనే ప్రమాణం చేశారు. ఆయన 2023-2025 వరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.
తెలుగు దేశం పార్టీకి చెందిన కొన్ని విషయాలను పరుచూరి తరని, వేమన సతీష్‌కు చెందిన రెండు వర్గాలు ప్రతిపాదించాయి. ఈ విషయాలకు సంబంధించి ఇరు వర్గాల ఏకాభిప్రాయానికి రాలేదు. ముందు రెండు వర్గాలు పరస్పరం మాటలు అనుకున్నారు. తర్వాత సహనం కోల్పోయి కొట్టుకున్నారు. పిడి గుద్దులు గుద్దుకున్నారు.
శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు జరిగే కార్యక్రమానికి అధ్యక్షులుగా వాసిరెడ్డి నవీన్ వ్యవహరిస్తున్నారు. అమెరికాలో తెలుగు కథకులు అంశంపై తాడికొండ శివకుమార శర్మ, డయస్సోరా కథలు అంశంపై సాయి బ్రహ్మానంద్ గొర్తి, కవితాపఠనం అంశంపై వసీరా, తమ్మినేని యదుకుల భూషణ్ మాట్లాడనున్నారు.
ఒక యుగపురుషుడికి నివాళులు అర్పించే మహత్తర అవకాశం తానా నుంచి ప్రవాస భారతీయులు, తెలుగు వారికి దక్కుతోంది.. మీ సహకారం - భాగస్వామ్యం కోరుకుంటూ .. రండి ... కదలి రండి అంటూ తానా సభ్యులు ఆహ్వానిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోని కళాశాలల్లో చదువుకొని అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థుల కోసం వివిధ కళాశాలల ఆలూమ్ని సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. తెలుగు జిల్లాల ఎన్నారై మీట్స్ కూడా నిర్వహిస్తున్నారు. వివిధ కళాశాలల అలూమ్ని, జిల్లా ఎన్నారైల సమావేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.