శనివారం సాయంత్రం నుంచే అభిమానుల్లోఫైనల్స్ పోనకాల లోడింగ్ మొదలైంది. అటు ప్లేయర్లు ఇప్పటికే అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు.
జాతీయ జట్టుకు ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కమిన్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడటం తనకు ఎప్పుడూ ప్రత్యేకమని, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా జాతీయ జట్టుకు ఆడాలని ఉందన్నాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని, దీని గురించి మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిన్స్ అభిప్రాయపడ్డాడు.
భారత్ లో కరోనా కల్లోలానికి అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు, గల్ఫ్ సహా ఆస్ట్రేలియా కూడా స్పందించి చేతనైన సాయం చేస్తున్నాయి. తమ వద్దనున్న ఆక్సిజన్, వైద్య పరికరాలు పంపిస్తున్నాయి.. ఇక ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ కూడా స్పందించి వెంటనే పీఎం కేర్స్ కు 50వేల డాలర్ల విరాళం ప్రకటించారు. విదేశీయుడైన పాట్ కమిన్స్ కరిగిపోయి దేశంలోని కరోనా తీవ్రత చూడలేక సాయం చేస్తే.. కోట్లు సంపాదిస్తున్న భారతీయ క్రికెటర్లు ఒక్కరు […]