ఒడిశాలోని కటక్ కు చెందిన గీతాంజలి అనే మహిళ రైలు ప్రమాదంలో మృతుల ఫొటోలు ఉంచిన ప్రదేశానికి వెళ్లింది. ప్రమాదం జరిగిన రోజు తన భర్త రైల్లో ప్రయాణిస్తున్నాడని,,, అతని ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని పోలీసులకు తెలిపింది.వెంటనే అక్కడున్న ఫొటోలు చూడమని పోలీసులు సూచించారు.
ప్రమాదం జరిగిన సమయంలో వెనుక ఉన్న బోగీలు ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యాయి. సామగ్రి మొత్తం కిందపడిపోయాయి. ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఏం జరిగిందని బయటకు చూస్తే ముందు ఉన్న బోగీలు నుజ్జునుజ్జయి కనిపించాయి.
ప్రమాదంలో 278 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు వంద మృతదేహాలను అధికారులు గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది అధికారులు ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఇప్పటికే ప్రమాదం జరిగి 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
అశ్విని వైష్ణవ్ గతంలో ఆయనో ఐఏఎస్ అధికారి. 1970లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జన్మించారు. 1991లో జోధ్‌పూర్ ఎంబిఎం ఇంజనీరింగ్ కాలేజీ (జేఎన్‌వీయూ) నుంచి ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగులో గోల్డ్ మెడలిస్ట్.
భారీ రైలు ప్రమాదంలో ఓ ప్రేమకథకు సంబంధించిన ఆనవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ప్రేమకు గుర్తుగా నిలిచిన కాగితాలు దర్శనమిచ్చాయి. కాగితాలపై బెంగాలీ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ కాగితాలు ఎవరో రాశారో తెలియదు గానీ డైరీలో నుంచీ చినిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
చనిపోయిన వ్యక్తులు ఎవరు? వారి కుటుంబాలు ఏమిటీ? వారికి ఏలాంటి సహాయ సహకారాలు అందించగలమా? అన్నది మనం ఆలోచించాల్సింది పోయి ఇలా కుట్రలు, కుతంత్రాలు అంటూ విమర్శలు చేయడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
కోల్‌కతాలోని హౌరాకు చెందిన హేలరామ్ మాలిక్ అనే దుకాణదారుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడానికి షాలిమార్ స్టేషన్‌లో తన 24 ఏళ్ల కొడుకు బిశ్వజిత్‌ను దింపాడు. రైలు బయల్దేరిన కొన్ని గంటలకే ఒడిశాలో రైలు ప్రమాదం వార్త తెలిసింది.
బాహనగ బజార్.. ఒక చిన్న గ్రామం. బాలసోర్ పట్టణానికి దగ్గరగా ఉంటుంది. బాహనగ బజార్ గ్రామం మీదుగానే రెండు వరుసల్లో రైల్వే ట్రాక్ వెళ్తుంది. మహా అయితే ఈ స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగుతుంది.
ఇలాంటి దుర్భర పరిస్థితిలో తన వంతు సాయం చేసేందుకు బిలియనీర్, దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, దిగ్గజ క్రికేటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.