చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలకంటే ఎక్కువగా దెబ్బతీసింది అమెరికానే. నాడు ట్రంప్ ఉన్న సమయంలో ఆయన పాలన వైఫల్యంతో లక్షల కేసులు.. వేల మరణాలు అమెరికాలో సంభవించాయి. ట్రంప్ కరోనా విషయంలో ముందు చూపులేక.. వ్యవహరించిన తీరు కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ ఘోరంగా ఓడిపోయాడు. ప్రజారోగ్యాన్ని పట్టించుకోని ట్రంప్ ను ప్రజలు గద్దెదించారు. అయితే ప్రపంచాన్ని ఆవహించిన అతి పెద్ద సంక్షోభాన్ని […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కూడా ప్రజల నిర్లక్ష్యం వల్ల ఈ వేవ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. దేశంలోని మహారాష్ట్రలో అయితే కేసుల తీవ్రత ఇంకా అధికంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్ […]
చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళనను పెంచుతున్నాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలో మాత్రం ప్రజలు మాస్కులు లేకుండా సందడి చేశారు. వుహాన్ లోని మాయా వాటర్ పార్క్ దగ్గర తాజాగా మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు వేల సంఖ్యలో సందర్శకులు […]
కరోనా కాలంలో మాస్కు అనే పదం ట్రెండింగ్ గా మారింది. మనిషికి ఒంటి మీద బట్టలు ఎలాగో.. మూతికి మాస్కు కూడా అనేలా పరిస్థితులు మారిపోయాయి. దేశంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు మాస్కుల్లేకుండా బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ మహ్మమరిపై మరింత అవగాహన కలిగించే ఓ రెస్టారెంట్ యజమాని చేసిన ప్రయత్నాన్ని ప్రతీఒక్కరు అభినందిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్! మధురైకి చెందిన ఓ రెస్టారెంట్ యజమాని కరోనా ట్రెండ్ తగ్గట్టుగా వినూత్నంగా […]
తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కొవిడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఆయన కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఏపీ సీఎం జగన్ కూడా కరోనా జాగ్రత్తల విషయంలో కొంచం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఆయన ముఖానికి మాస్క్ ధరించడానికి అంతగా ఆసక్తిగా లేరని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ […]
వైద్యుడు సుధాకర్ తల్లి వేసిన హేబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. సుధాకర్ డిశ్చార్జ్‌కి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని డాక్టర్ సుధాకర్‌కు సూచించింది. విచారణలో పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సుధాకర్ ను అరెస్ట్ చేసినట్లు చూపించకుండా గత నెల 16వ తేదీ నుంచి ఈ రోజు వరకూ విశాఖ పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకున్నారని, తనకు వైద్యం అవసరం లేదని పూర్తిగా ఆరోగ్యంగా […]
ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం ‘’ 64 వ భాగంలో మాట్లాడుతూ కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోంది. క్లిష్ట సమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయని కొనియాడారు. దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయని చెబుతూ ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని హితవు చెప్పారు. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలం అని […]
కరోనా వ్యాప్తి కారణంగా మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు ప్రభుత్వం గతలోనే ప్రకటించాయి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. మాస్క్ ధరించకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారిని గుర్తించి రూ.1000 పెనాల్టీ విధిస్తున్నారు. పీజేఆర్ నగర్, రాజీవ్‌నగర్ లో మాస్క్ లేకుండా కూరగాయల మార్కెట్ లో విక్రయాలు సాగిస్తోన్న వ్యక్తులకూ రూ.1000 చొప్పున పెనాల్టీ వేశారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా […]
మొన్న మొన్నటి వరకు మాస్కులు లేవని మోత్తుకున్నారు. గ్లౌజ్‌లు ఇవ్వడంలేదని గోల చేశారు. పీపీఈ కిట్లు తక్కువగా ఉన్నాయని గోడవ చేశారు. ఎట్టకేలకు ఇత్యాది సమస్యలు ఎంతోకొంత సర్దుమనిగాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మరో చిక్కొచ్చి పడ్డది. ప్రజలు వారు ఉపయోగించుకున్న మాస్కులు, గ్లౌజ్‌లను బాధ్యతా రాహిత్యంగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరో సమస్యకు కారణమౌతున్నారు. ప్రజలు వినియోగిస్తున్న మాస్కులను విధుల్లో, రోడ్లపైన పడేస్తూ ఉన్నారు. కరోనాపైన యావత్తు భారతావని యుద్ధం చేస్తున్న తరుణంలో, కేంద్ర, రాష్ట్ర […]
దేశంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ ప్రజలకు ఎలా సేవలందించాలనే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో అపన్నహస్తం భాగమని.. కరోనా సమయంలో ప్రజల అవసరాలను తీరుస్తున్న ప్రతీఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కరోనా పోరులో ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ప్రతీపౌరుడు సైనికులాడిలా పోరాడుతున్నారని ఆయన కొనియాడారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. […]