సాధారణంగా ఒక కేసు కు సంబంధించి విచారణ లాంటివి జరగకుండానే కొట్టివేయడం అనేది జరగదు. రామోజీరావు విషయంలో అలానే జరిగింది. మార్గదర్శి లో తన తండ్రికి తెలియకుండానే షేర్లు తీసుకున్నారని యూరి రెడ్డి అనే వ్యక్తి ఆ మధ్య సిఐడి కి ఫిర్యాదు చేశాడు.
సహజంగానే రామోజీరావుకు మార్గదర్శి ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. అతడి గ్రూపు సంస్థల్లో మార్గదర్శి విపరీతమైన లాభాల్లో ఉంది. అయితే ఇందులో ఉన్న అవకతవకలను ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా తెలివిగా పసిగట్టి కోర్టుకు లాగాడు.
రామోజీరావును బహిరంగంగా వెనకేసుకొచ్చే కొంతమంది జర్నలిస్టుల తీరు జనాలకు ఏవగింపు కలిగిస్తోంది. నేను తప్పు చేస్తాను.. ఆ హక్కు నాకుంది.
పెద్దమనిషి ముసుగులో రామోజీ ఒక మాయా ప్రపంచాన్నే సృష్టించగలిగారు. అందులో భాగమే మార్గదర్శి. రామోజీ అభివృద్ధికి అసలు సిసలైన మూల కారకం కూడా మార్గదర్శి.
ఈనాడు.. చంద్రబాబు క్యాంపులో ప్రధాన పత్రిక.. రామోజీరావు.. చంద్రబాబుకు రాజకీయ గురువు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో ఈనాడు శోకాలు పెడుతోంది.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 22న నోటీసులు జారీ చేశారు. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఏప్రిల్ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్ 23న సమాధానం ఇచ్చారు.
మార్గదర్శి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఏపీ సిఐడి దారితప్పినట్టు కనిపిస్తోంది. చిట్స్ వేసి పాడుకొని డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టన వారిని తీసుకువచ్చి మార్గదర్శి మోసం చేసిందని ఏపీ సిఐడి అధికారులు కేసులు పెట్టించారు.
రామోజీరావుకు జగన్తో భారీ వైరం ఉంది. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇందులో ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారే అన్నట్టు ముందుకు సాగుతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజ గురువు రామోజీ చక్రం తిప్పేవారు. తన అడుగులకు మడుగులోత్తే విధంగా ప్రభుత్వాలు సాగిలాలు పడేలా వ్యవహరించేవారు.
వాస్తవానికి మార్గదర్శి చాలా నిబంధనలను పాటించడం లేదని సిఐడి గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 37 బ్రాంచులు మార్గదర్శికి ఉన్నాయి. డిపాజిట్ దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని స్థానిక జిల్లాలోని బ్యాంకుల్లోనే ఉంచాలి.