ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. నాలుగైదు టైటిల్స్ ప్రచారం కాగా గుంటూరు కారం అంటే టైటిల్ కే యూనిట్ ఫిక్స్ అయ్యారంటున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది. దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో అతడు, ఖలేజా చిత్రాలకు కలిసి పని చేశారు. 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి వరుసగా మూడో చిత్రం.
మహేష్ బాబు త్రివిక్రమ్ కి షరతులు మీద షరతులు పెడుతున్నాడట. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో 90 రోజుల నాన్ స్టాప్ లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని, లేకపోతే సినిమాని ఇక్కడితోనే ఆపేద్దాం అని చెప్పాడట.