కొత్త పార్లమెంట్ భవనం పాత భవనం కంటే చాలా పెద్దది. పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలు కూర్చునే ఏర్పాట్లతోపాటు లైబ్రరీ, లాంజ్, ఛాంబర్ ఉన్నాయి. ఇవే కాకుండా ఎంపీలు, త్రికయులకు రాయితీదారులకు ఆహారం అందించే క్యాంటీన్ కూడా ఉంది.
New Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. రేపు కొత్త పార్లమెంట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే.. కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చే గుమ్మాలు చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. పార్లమెంట్ భవనంలో ఆరు దర్వాజలకు ఆరు పౌరాణిక ప్రాణుల పేర్లను పెట్టారు. ఈ ఆరు ప్రాణులు 140 కోట్ల భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేకతలను సూచిస్తున్నాయి. అవేంటంటే.. గజ ద్వారం, అశ్వ ద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, శార్దూల ద్వారం, హంస […]
ప్రజాస్వామ్య దేవాలయంగా నూతన పార్లమెంట్‌ను, అన్నివర్గాల ప్రజల కొత్త గృహంగా ప్రముఖులు నూతన పార్లమెంట్‌ను కీర్తిస్తుంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి.. కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికతో పోల్చింది బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ . వైపరీత్య బుద్దితో మోడీకి క్రెడిట్ రాకుండా ఉండేందుకు చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అయితే మోడీకి పేరు రావద్దని ఇలా కాంగ్రెస్ బాయ్ కాట్ వ్యూహం పన్నింది. కానీ కాంగ్రెస్ ను పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు. కాంగ్రెస్ తీరును ఈసడించుకుంటున్నారు.
అంతేకాకుండా రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటులోని కొన్ని లక్షణాలను కాపాడేందుకు లోపలి గోడలపై శ్లోకాలు రాశారు. ఈ నిర్మాణానికి దోల్పూర్ రాయి ప్రధానంగా వాడారు.
సరిగ్గా 9 గంటలకు సెంగోల్(రాజదండం)ను స్పీకర్ చాంబర్ సమీపంలో ప్రతిష్ఠిస్తారు. 9.30కు లాబీలో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. దీంతో ప్రారంభోత్సవ తంతు ముగుస్తుంది. రెండో సెషన్ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సెషన్లో పలువురు అతిథులు, ఎంపీలు, అధికారులు పాల్గొంటారు..