అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో భూముల ధరలు హైదరాబాద్ భూముల ధరలతో పోల్చితే పదింతలు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎకరం భూమి ధర రూ.40–50 కోట్ల వరకు ఉండగా, డల్లాస్, ఆస్టిన్‌లలో కేవలం 5,00,000 నుంచి 7,00,000 డాలర్లు పలుకుతోంది.
Hyderabad Real Estate : కరోనా కల్లోలంతో కుదేలైన రియాల్టీ రంగానికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటోంది. దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. మన రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దేశంలో రియల్ బూమ్ ఏర్పడినా ఇక్కడ మాత్రం జోరు తగ్గలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ దేశంలోనే అత్యధిక భూమ్ కలిగిన నగరంగా వినతికెక్కుతోంది. […]
ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే.. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతోంది. గడ్డు పరిస్థితుల్లోనూ.. మిగిలిన నగరాలను బీట్ చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ ప్రత్యేక బ్రాండ్ సంపాదించిందని ఓ నివేదిక తేల్చింది. పూర్తి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భాగ్యనగరి తన సత్తాను చాటుకుంది. తాజాగా విడుదల అయిన పాప్ టైగర్.. జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మిగిలిన రంగాలకు భిన్నంగా రియల్ రంగం కరోనాకాలంలో భారీగా దెబ్బతీసింది. పలు […]