కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఓ వైపు బెంబేలెత్తిపోతుంటే.. సందట్లో సడేమియాగా మరోవైపు మాస్కులు దందా మొదలైంది. చైనా సోకిన కరోనా వైరస్(కోడ్-19) క్రమంగా అన్నిదేశాలకు విస్తరిస్తుంది. ఇప్పటికే 60దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే 3వేల మంది మృత్యువాతపడ్డారు. 90వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మహ్మమ్మరి ఇండియాలోకి ప్రవేశించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సికింద్రాబాద్లోని మహేంద్రహిల్స్కు చెందిన […]