2023 సెప్టెంబర్ 18 నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గతంలో కంటే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే వాడారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోనూ 63 అడుగుల మట్టివిగ్రహాన్నే తయారు చేయడం విశేషం.
గణేశుడి ఆరాధనలో గరిక లేకుంటే అసంపూర్ణంగా పరిగణిస్తారు. శ్రీ గణేషుడికి గరిక చాలా ప్రియం. దానికి సంబంధించిన అనేక కథలు మన మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి.
ఈ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ 18న నిర్వహిస్తారని అంటున్నారు. మరికొందరు 19న జరుపుకుంటామని చెబుతున్నారు. ఏ రోజు జరుపుకున్నా వినాయకుడికి ప్రత్యేక పూజ చేసేవారు మొదట శుచి శుభ్రతతో మెలగాలి.