కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని జోక్యం చెప్పిన ఓ అస్ట్రాలజర్ తోనూ ట్వీట్ చేయించారు. ఆయన ట్వీట్ ను వైసీపీ నేతలు ప్రచారం చేసుకునేలోపే పాత ట్వీట్ వైరల్ అయింది. తాజాగా హర్యానా కు చెందిన ఓ అస్ట్రాలజర్ తో ట్వీట్ చేయించారు. ఇలా వరుసగా సమయం సందర్భం లేకుండా జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. జగన్ సీఎం అవుతారని ఎందుకు ట్విట్టర్‌లో జోస్యాలు చెప్పిస్తున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.