పాండు రోగానికి శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధం 10 గ్రాములు తీసుకుని దాన్ని 50 గ్రాములు ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని మరగబెట్టి రోజువారీ ఆహారంలో తీసుకుంటే పాండు రోగం తగ్గుతుంది.
ఎన్నో రోగాలను నయం చేయగల దివ్యౌషధం, మహా మూలికలలో శొంఠి ఒకటని చెప్పవచ్చు. శొంఠి ఎన్నో అపూర్వమైన గుణాలను కలిగి ఉంది. మహర్షులు శొంఠికి విశ్వభేజనం అని నామకరణం చేశారంటే శొంఠి యొక్క గొప్పదనం ఏమిటో సులభంగానే అర్థమవుతుంది. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్నపుతేటలో ముంచి నానబెడితే శొంటి వస్తుంది. వర్షాకాల వ్యాధులకు సులభంగా చెక్ పెట్టడంలో శొంఠి ఎంతగానో సహాయపడుతుంది. వర్షాకాలంలో చాలామందిని జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. శొంఠి పొడిని నీళ్లలో […]