పాలు తాగితే చాలా వరకు రోగాలు నయమవుతాయి. పాలల్లో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇందులో అమైనా యాసిడ్స్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. పాలలో 87 శాతం నీరు ఉంటుంది. మిగిలిన 13 శాతం ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.